ఎటులైన పోవలె.. గుర్రంపై గడపగడపకు ఎమ్మెల్యే!
విధాత: గడపగడపకు మన ప్రభుత్వం అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి అధినేత జగన్ ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. ప్రతివారం ఈ కార్యక్రమం మీద నివేదికలు తెప్పిస్తున్న జగన్ ఇందులో ఎవరెవరు పాల్గొనలేదు..ఎవరు ఎన్నిరోజులు ఎగ్గొట్టారన్నది మీటింగులో రిజల్ట్స్ చదువుతూ ఎమ్మెల్యేలు, మంత్రులు అని చూడకుండా చీవాట్లు పెడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు భయంతోనో భక్తితోనో తన నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అవసరాన్ని బట్టి వాగులు వంకలు దాటుకుంటూ గ్రామాల్లోకి వెళుతూ ప్రజలను పలకరిస్తున్నారు. సరే ప్లెయిన్ […]

విధాత: గడపగడపకు మన ప్రభుత్వం అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి అధినేత జగన్ ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. ప్రతివారం ఈ కార్యక్రమం మీద నివేదికలు తెప్పిస్తున్న జగన్ ఇందులో ఎవరెవరు పాల్గొనలేదు..ఎవరు ఎన్నిరోజులు ఎగ్గొట్టారన్నది మీటింగులో రిజల్ట్స్ చదువుతూ ఎమ్మెల్యేలు, మంత్రులు అని చూడకుండా చీవాట్లు పెడుతున్నారు.
దీంతో ఎమ్మెల్యేలు భయంతోనో భక్తితోనో తన నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అవసరాన్ని బట్టి వాగులు వంకలు దాటుకుంటూ గ్రామాల్లోకి వెళుతూ ప్రజలను పలకరిస్తున్నారు. సరే ప్లెయిన్ ఏరియాల్లో అయితే ఏదోలా కార్లలో వెళ్తారు. మరి కొండలు గుట్టల్లో దాక్కుని ఉండే పల్లెలు, గిరి శిఖర గిరిజన గ్రామాల సంగతి ఏమిటి.. కొండల్లోకి నేను పోలేను అంటే బాస్ ఊరుకోడు.. అందుకే తమకి నచ్చినా నచ్చకున్నా అష్ట కష్టాలు పడి ఆ గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది.
ఎపిడమిక్ సీజన్లో విశాఖ శ్రీకాకుళం పార్వతిపురం విజయనగరం జిల్లాల్లో గర్భిణులు.. నడవలేని రోగులను అతి కష్టం మీద కిలోమీటర్ల కొద్దీ డోలిలో మోసుకొస్తుంటారు.. వానాకాలంలో ఇక్కడి మార్గాలు మరీ ఘోరంగా ఉంటాయి. వాగులు..వంకలు పొంగిపొర్లుతూ మార్గాలన్ని మూసేస్తుంటాయ్. కొన్ని ఊళ్లకు బయటి లోకంలో సంబంధాలు తెగిపోతుంటాయ్.
ఇప్పుడు అలాంటి గ్రామాల్లోకి చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ వెళ్లారు.రోలుగుంట మండలం శివారు పంచాయతీ అయిన ఆర్లలోని అనుబంధ గ్రామాలు గుర్రాల బైల, గదభ పాలెం, లొసంగి తదితర గురిజన పల్లెల్లోకి గుర్రం మీద వెళ్లారు. ఆ రూట్లలో కార్లు జీపులు వెళ్లవు కాబట్టి వెళ్తే నడిచి లేదా గుర్రాల మీదనే వెళ్ళాలి. మొత్తానికి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తాను సైతం బాగా కష్టపడి వెళ్లిన ఎమ్మేల్యే ధర్మశ్రీ కి ప్రజలు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూడా రోడ్డు వేయిస్తానని ఆ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మొత్తానికి గుర్రం మీద గ్రామానికి వెళ్లిన ధర్మశ్రీ మంచి మార్కులు కొట్టేశా