MUNUGODE: ఎమ్మెల్యే రఘునందన్ రావుకు చుక్కెదురు

విధాత: సంస్థాన్‌ నారాయణపురంలో ప్రచారం నిర్వహిస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు ఇదే అనుభవం ఎదురయింది. మండలంలోని లింగవారిగూడెంలో రఘునందన్‌ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అయితే గ్రామ ప్రజల నుంచి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమ ఊర్లో ప్రచారం చేయడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. దీంతో చేసేందేం లేక రఘునందన్‌ రావు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మునుగోడులో ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్ది వాతావరణం హీటెక్కుతున్నది. రాజకీయ […]

  • By: krs    latest    Oct 21, 2022 6:31 AM IST
MUNUGODE: ఎమ్మెల్యే రఘునందన్ రావుకు చుక్కెదురు

విధాత: సంస్థాన్‌ నారాయణపురంలో ప్రచారం నిర్వహిస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు ఇదే అనుభవం ఎదురయింది. మండలంలోని లింగవారిగూడెంలో రఘునందన్‌ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అయితే గ్రామ ప్రజల నుంచి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది.

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమ ఊర్లో ప్రచారం చేయడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. దీంతో చేసేందేం లేక రఘునందన్‌ రావు అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

మునుగోడులో ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్ది వాతావరణం హీటెక్కుతున్నది. రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే నియోజకవర్గంలో బీజేపీకి మొదటి నుంచి నిరసనలే వ్యక్తమవుతున్నాయి.

ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్లిన ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డిని ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నావని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.