హిందూ వ్యతిరేకిగా తెలంగాణ ప్రభుత్వం: ఎమ్మెల్యే రాజాసింగ్‌

  • Publish Date - September 26, 2023 / 11:24 AM IST

విధాత : హిందువులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహారిస్తుందని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుస్సెన్‌ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవంపై హైకోర్టు లో ప్రభుత్వం తన వాదనలు సరిగా వినిపించకపోవడంతోనే విగ్రహా నిషేధం ఉత్తర్వులిచ్చిందన్నారు.


కొన్నేళ్లుగా హుస్సెన్‌ సాగర్‌లో డ్రైనేజ్‌ నీళ్లు కలుస్తున్నాయని వాటితో సాగర్‌ జలాలు కలుషితం కావడం లేదా అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి హుస్సెన్‌ సాగర్‌లో గణేష్‌ నిమజ్జనోత్సవం ఘనంగా కొనసాగుతుందని, వాటిని అడ్డుకునే దురుద్ధేశంతోనే కోర్టుకెళ్లారని మండిపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూవులపై బీఆరెస్‌ ప్రభుత్వం అణిచివేతకు పాల్పడుతుందన్నారు.


అసెంబ్లీ సాక్షీగా సీఎం కేసీఆర్‌ హుస్సెన్‌ సాగర్‌ను కొబ్బరి నీళ్ల మాదిరిగా మారస్తారనని చెప్పి ఎందుకు చేయలేదన్నారు. కాలుష్య నియంత్రణ మండలి వద్ధ వినాయక విగ్రహాల నిమజ్జనంతో నీళ్లు కలుషితమవుతున్నాయన్న నివేదిక ఉంటే కోర్టు ముందు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.


ఉమ్మడి రాష్ట్రంలో పీవోపీ విగ్రహాతో హుస్సెన్‌ సాగర్‌ కలుషితం కాదని ఉత్తర్వులు ఉన్నాయని వాటిని కోర్టుకు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. తీరా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశాకున్నాకా హైకోర్టు తీర్పు రావడం ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నామన్నారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా హుస్సెన్‌ సాగర్‌లో గణేష్‌ నిమజ్జనోత్సవం జరుగుతుందని, ఎవరనా అడ్డుపడితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.