MLA Seethakka | సభలో మాట్లాడినివ్వడం లేదు: సీతక్క బాయ్ కాట్
MLA Seethakka విధాత: శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వం, స్పీకర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వడం లేదని, అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో తనకు అర్ధం కావడం లేదని, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తు తాను సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రకటించారు. సభలోకి వచ్చాకా కూడా బిజినెస్ గూర్చి చెప్పడం లేదని, జీరో ఆవర్లో కూడా మాట్లాడనివ్వడం లేదని, సభా నిర్వాహణ తీరుతో మాట్లాడే అవకాశం లేకుండాపోవడంతో ఇక సభకు హాజరై […]

MLA Seethakka
విధాత: శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వం, స్పీకర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వడం లేదని, అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో తనకు అర్ధం కావడం లేదని, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తు తాను సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రకటించారు.
సభలోకి వచ్చాకా కూడా బిజినెస్ గూర్చి చెప్పడం లేదని, జీరో ఆవర్లో కూడా మాట్లాడనివ్వడం లేదని, సభా నిర్వాహణ తీరుతో మాట్లాడే అవకాశం లేకుండాపోవడంతో ఇక సభకు హాజరై చేసేదేముందన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంతసేపు మాట్లాడిన మైక్ కట్ చేయరని, అదే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తాము మాట్లాడితే నిమిషానికే మైక్ కట్ చేస్తున్నారన్నారు. సభలో అధికార పార్టీ సభ్యులు అసత్యాలు మాట్లాడుతున్నారని, తమ ఎన్నికల ప్రచారం కోసం సభను వాడుకుంటున్నారని సీతక్క ఆరోపించారు.
నాలుగున్న సంవత్సరాల క్రితం ఎన్నికైన సభ్యులు సభలో ఉంటే తొమ్మిదేళ్ల ప్రగతి గూర్చి చర్చ ఎందుకన్నారు. మిషన్ భగీరథ కింద ప్రభుత్వం గ్రామాలన్నింటికి నీళ్లిస్తే వాటర్ ఫ్లాంట్లు ఎందుకు పెట్టుకుంటున్నారన్నారు. సమస్యలు లేనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్లో ఎందుకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నారంటు ప్రశ్నించారు.