సమావేశం మధ్యలో.. ఆకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిన మోటకొండూరు ఎమ్మార్వో

- మోట కొండూరు తాసిల్దార్ కు గుండెపోటు
- షాక్ కు గురైన అధికారులు ఉద్యోగులు
విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: మోటకొండూరు ఎమ్మార్వో శాంతిలాల్ నాయక్ ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సన్నాహక సమావేశం జరుగుతుండగా శాంతి లాల్ నాయక్ ఒకసారిగా కుప్ప కూలిపోయారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న తహసిల్దార్లు ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హుటాహుటిన అధికారులు సిబ్బంది ప్రత్యేక వాహనంలో ఆసుపత్రికి తరలించారు. గత కొద్దికాలంగా శాంతిలాల్ నాయక్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.