వరంగల్‌ MRO కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం- ASI కంట్లో పడిన పురుగుల మందు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నల్లబెల్లి మండలం బిల్ నాయక్ తండాకు చెందిన మాలోత్ పద్మ తన భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆరోపిస్తూ గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. View this post on Instagram A post shared by విధాత తాజా వార్తలు (@vidhaatha_news) గమనించిన మహిళా […]

  • By: krs    latest    Mar 24, 2023 9:09 AM IST
వరంగల్‌ MRO కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం- ASI కంట్లో పడిన పురుగుల మందు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

నల్లబెల్లి మండలం బిల్ నాయక్ తండాకు చెందిన మాలోత్ పద్మ తన భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆరోపిస్తూ గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది.

గమనించిన మహిళా పోలీసులు ఆమె నుంచి పురుగుల మందు బాటిల్ ను లాక్కునేందుకు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఏఎస్సై రాజేశ్వరి కంట్లో పురుగుల మందు పడింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.