Viral Video | పట్టాలపై తల్లీకుమారుడు.. వేగంగా దూసుకొచ్చిన రైలు..
Viral Video | తల్లీకుమారుడు కలిసి రైలు పట్టాలు దాటుతుండగా ఓ రైలు వేగంగా దూసుకొచ్చింది. ప్లాట్‌ఫామ్ ఎక్కలేకపోయారు వారిద్దరూ. దీంతో అక్కడున్న ప్రయాణికులంతా ఆ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అని ఊపిరి బిగపట్టి చూశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని కలబురాగి రైల్వే స్టేషన్‌లో తల్లీకుమారుడు కలిసి వేరే ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్లేందుకు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే అదే ట్రాక్‌పై వేగంగా రైలు దూసుకొచ్చింది. తమ ప్రాణాలను […]

Viral Video | తల్లీకుమారుడు కలిసి రైలు పట్టాలు దాటుతుండగా ఓ రైలు వేగంగా దూసుకొచ్చింది. ప్లాట్‌ఫామ్ ఎక్కలేకపోయారు వారిద్దరూ. దీంతో అక్కడున్న ప్రయాణికులంతా ఆ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అని ఊపిరి బిగపట్టి చూశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కర్ణాటకలోని కలబురాగి రైల్వే స్టేషన్‌లో తల్లీకుమారుడు కలిసి వేరే ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్లేందుకు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే అదే ట్రాక్‌పై వేగంగా రైలు దూసుకొచ్చింది. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్లాట్‌ఫామ్ ఎక్కేందుకు యత్నించారు. కానీ వీలు కాలేదు.
దీంతో ప్రాణాలను దక్కించుకునేందుకు ప్లాట్‌ఫామ్ గోడకు అతుక్కుపోయారు. రైలు స్టేషన్ దాటిన తర్వాత తల్లీకుమారుడు ఊపిరి పీల్చుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.