ప్రేమ వివాదంలో కూతురును హత్య చేసిన తల్లి

ఇటీవల హైదరాబాద్ - ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో అనుమానస్పద స్థితిలో హత్యకు గురైన యువతి భార్గవి(19) మరణానికి ఆమె తల్లినే కారణమని పోలీసులు విచారణలో తేల్చారు

  • By: Somu    latest    Mar 20, 2024 11:38 AM IST
ప్రేమ వివాదంలో కూతురును హత్య చేసిన తల్లి
  • పోలీసుల వెల్లడి

విధాత, హైదరాబాద్‌ : ఇటీవల హైదరాబాద్ – ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో అనుమానస్పద స్థితిలో హత్యకు గురైన యువతి భార్గవి(19) మరణానికి ఆమె తల్లినే కారణమని పోలీసులు విచారణలో తేల్చారు. తల్లి జంగమ్మ తన కూతురు భార్గవికి మేన బావతో పెళ్లి కుదిర్చింది.


తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరు లేని రోజున తన ప్రియుడిని ఇంటికి పిలిచి భార్గవి మాట్లాడుతున్న సమయంలో తల్లి జంగమ్మ ఇంటికి చేరుకుంది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చని తల్లి జంగమ్మ భార్గవిని ఆవేశంలో చితకబాది, చీరతో ఉరేసి చంపినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు విచారణ కొనసాగిస్తూ నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లుగా తెలిపారు.