Woman Throws Son In River। మానసిక స్థిమితం లేని పిల్లాడిని నదిలో విసిరేసిన తల్లి.. రాజస్థాన్‌లో దారుణం.. మహిళ అరెస్ట్‌

Woman Throws Son In River । Mentally Challenged Son । పేరులో ‘దిల్‌’ ఉంది.. కానీ.. ఆమెలో ‘తల్లి హృదయం’ లేకపోయింది. మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న కొడుకు తనకు భారమయ్యాడనుకున్నదో.. లేక భవిష్యత్తులో అతనే ఇబ్బంది పడతాడని ఆందోళన చెందిదో.. కొడుకును నదిలో విసిరేసింది. ఈ ఘోరం రాజస్థాన్‌లో చోటు చేసుకున్నది. విధాత : మానసిక సమస్యలతో సతమతమవుతున్న సొంత కొడుకును దిల్‌ అఫ్రోజ్‌ (26) అనే మహిళ రాజస్థాన్‌లోని షియోపూర్‌ జిల్లా […]

  • By: krs    latest    Mar 02, 2023 11:19 PM IST
Woman Throws Son In River। మానసిక స్థిమితం లేని పిల్లాడిని నదిలో విసిరేసిన తల్లి.. రాజస్థాన్‌లో దారుణం.. మహిళ అరెస్ట్‌

Woman Throws Son In River ।

Mentally Challenged Son । పేరులో ‘దిల్‌’ ఉంది.. కానీ.. ఆమెలో ‘తల్లి హృదయం’ లేకపోయింది. మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న కొడుకు తనకు భారమయ్యాడనుకున్నదో.. లేక భవిష్యత్తులో అతనే ఇబ్బంది పడతాడని ఆందోళన చెందిదో.. కొడుకును నదిలో విసిరేసింది. ఈ ఘోరం రాజస్థాన్‌లో చోటు చేసుకున్నది. విధాత : మానసిక సమస్యలతో సతమతమవుతున్న సొంత కొడుకును దిల్‌ అఫ్రోజ్‌ (26) అనే మహిళ రాజస్థాన్‌లోని షియోపూర్‌ జిల్లా అద్రశీల ప్రాంతంలో చంబల్‌ నదిలోకి నదిలోకి విసిరేసిన ఘటన సంచలనం రేపింది.

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లాకు చెందిన దిల్‌ అఫ్రోజ్‌ (Dil Afroj)కు ఏడేళ్లక్రితం వివాహమైంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మానసిక సమస్యలు ఉన్న బాలుడి వయసు కేవలం నాలుగేండ్లు. కనీసం మాట్లాడలేడు. పైగా బలహీనంగా ఉంటాడు. అతడితో విసుగెత్తి మంగళవారం రాజస్థాన్‌లోని దడబారి (Dadabari) ప్రాంతంలోని అద్రశీల వద్ద చంబల్‌ నది (Chambal)లోకి విసిరేసినట్టు ఒప్పుకొన్నదని డీఎస్పీ అమర్‌సింగ్‌ తెలిపారు.

అఫ్రోజ్‌ కుటుంబం ఒక వివాహం నిమిత్తం బరాన్‌ జిల్లా మంగ్రోల్‌కు వచ్చింది. అయితే.. బాలుడిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న అఫ్రోజ్‌.. రాజస్థాన్‌లోని అద్రశీల(Adharsheela) కు చేరుకున్నది. తన వెంట బాలుడితో పాటు.. ఆరేళ్ల కుమార్తెను కూడా వెంటబెట్టుకుని వెళ్లింది. అక్కడి మసీదులో ప్రార్థనలు చేసిన అనంతరం బాలుడిని నదిలోకి విసిరిపారేసింది.

స్థానిక మత బోధకుడు బాలుడి గురించి ఆరా తీయగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిందని డీఎస్పీ తెలిపారు. కాసేపటికి నదిలో తేలుతున్న బాలుడి శవాన్ని గుర్తించిన మత బోధకుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సదరు మహిళను, ఆమె భర్తను గుర్తించి పోలీసులు బుధవారం ఇంటరాగేట్‌ చేయడంతో ఆమె జరిగిన విషయం వివరించింది. అఫ్రోజ్‌ను అరెస్టు చేశారు.