Bandi Sanjay | ఎంపీ బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి
Bandi Sanjay | హైకోర్టు ఆదేశాలు సైనిక సంక్షేమ నిధికి రూ.50,000 కాస్ట్ చెల్లించిన ఎంపీ తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసిన ధర్మాసనం విధాత, హైదరాబాద్ : కరీంనగర్ శాసన సభ్యుడు గంగుల కమాలకర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఎంపీ బండి సంజయ్ క్రాస్ ఎగ్జామ్ నేషన్ శుక్రవారం పూర్తి అయ్యింది. బండి సంజయ్ క్రాస్ ఎగ్జామ్ నేషన్ వాగ్మూలాన్ని అడ్వకేట్ కమిషనర్ నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2018 డిసెంబర్‌లో […]

Bandi Sanjay |
- హైకోర్టు ఆదేశాలు
- సైనిక సంక్షేమ నిధికి రూ.50,000 కాస్ట్ చెల్లించిన ఎంపీ
- తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసిన ధర్మాసనం
విధాత, హైదరాబాద్ : కరీంనగర్ శాసన సభ్యుడు గంగుల కమాలకర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఎంపీ బండి సంజయ్ క్రాస్ ఎగ్జామ్ నేషన్ శుక్రవారం పూర్తి అయ్యింది. బండి సంజయ్ క్రాస్ ఎగ్జామ్ నేషన్ వాగ్మూలాన్ని అడ్వకేట్ కమిషనర్ నమోదు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నిమోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నుంచి బండి సంజయ్ బీజేపీ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ ఆయన నమోదచేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారని, ఆయన ఎన్నిక చెల్లదంటూ తనను ఎమ్మెల్యేగా పేర్కొనాలని సమీప ప్రత్యర్థి అయిన బండి సంజయ్ 2019లో తెలంగాణ హైకోర్టులో ఈపీ (ఎన్నికల పిటిషన్) దాఖలు చేశారు.
అయితే ఈ పిటిషన్‌లో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో బండి సంజయ్‌ను క్రాస్ ఎగ్జామ్ చేయాలని జూన్‌లో రిటైర్డ్ జడ్జి శైలజను అడ్వకేట్ కమిషనర్‌గా న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూర సుమలత ఆదేశించారు. అయితే గత విచారణలో పార్లమెంట్ సమావేశాలు, వ్యక్తిగత కారణాలతో బండి సంజయ్ కోర్టుకు హాజరుకాక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆయన రూ.50,000 కాస్ట్ కట్టాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
అయితే గురువారం కోర్టుకు హాజరైన ఎంపీ బండి సంజయ్ ను క్రాస్ ఎగ్జామ్ చేయాలని గంగుల కమలాకర్ తరుఫు న్యాయవాది వినతి మేరకు న్యాయస్థానం అడ్వకేట్ కమిషనర్‌ను ఆదేశించారు. దీనికి అంగీకరిం చిన అడ్వకేట్ కమిషనర్ శుక్రవారం క్రాస్ ఎగ్జామ్ నేషన్ పూర్తి చేసి వాగ్మూలాన్ని తీసుకొని కోర్టు ముందు సమర్పించారు.
అనంతరం బండి గత విచారణలకు హాజరు కాకుండా పలుమార్లు వాయిదాలు కోరిన నేపథ్యంలో అసహానం వ్యక్తం చేసి కాస్ట్ కట్టాలని చెప్పిన న్యాయస్థానం ఆదేశాల మేరకు రూ.50,000 లను సైనిక సంక్షేమ నిధికి ఎంపీ బండి సంజయ్ చెల్లించారు. అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూర సుమలత ఈనెల 20కి వాయిదా వేసింది.