మీ కుమార్తెతో కలిసి ఆ సినిమా చూడండి.. షారూక్‌పై మండిపడ్డ స్పీకర్
Pathaan | బాలీవుడు హీరో షారూక్ ఖాన్, నటి దీపికా పదుకొనే జంటగా నటించిన పఠాన్ చిత్రం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. వచ్చే నెల 25న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవలే మేకర్స్ బేషరమ్ అనే సాంగ్‌ను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్‌లో దీపికా ధరించిన దుస్తులపై బీజేపీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీపికా కాషాయం కలర్ దుస్తులు ధరించిందని, ఆ సినిమాను నిషేధించాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి […]

Pathaan | బాలీవుడు హీరో షారూక్ ఖాన్, నటి దీపికా పదుకొనే జంటగా నటించిన పఠాన్ చిత్రం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. వచ్చే నెల 25న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవలే మేకర్స్ బేషరమ్ అనే సాంగ్‌ను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్‌లో దీపికా ధరించిన దుస్తులపై బీజేపీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీపికా కాషాయం కలర్ దుస్తులు ధరించిందని, ఆ సినిమాను నిషేధించాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
పఠాన్ సినిమాను వ్యతిరేకిస్తున్న జాబితాలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ కూడా చేరారు. తాజాగా ఈ మూవీపై స్పీకర్ స్పందించారు. షారూక్ ఖాన్ ఈ సినిమాను తన కూతురుతో కలిసి చూడాలని, దానికి సంబంధించిన ఫోటోను అప్‌లోడ్ చేయాలని స్పీకర్ సూచించారు. కుమార్తెతో కలిసి ఈ సినిమా చూశానన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాలని, ఇలాంటి సినిమానే ప్రవక్తపై తీయాలని షారూక్‌కు స్పీకర్ గౌతమ్ సవాల్ చేశారు.
అయితే సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో పఠాన్ చిత్రం నిషేధంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో ఉన్న కాస్ట్యూమ్ అభ్యంతరకర రీతిలో ఉన్నాయని, ఇది కలుషితమైన మైండ్‌సెట్‌ను చాటుతుందని నరోత్తమ్ మిశ్రా ఆరోపించిన సంగతి తెలిసిందే. బేషరమ్ సాంగ్‌లో కొన్ని మార్పులు చేయాలని, లేదంటే ఆ సినిమా విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.