MSRTC | రూఫ్ లేచిపోయినా ఆగని బస్.. డ్రైవర్ సస్పెండ్
MSRTC విధాత: మహారాష్ట్రలో ఓ ఆర్టీసీ బస్సు రూఫ్ లేచిపోయింది. అందులో ఉన్న 40మంది ప్రయాణికులు ఆపండి… ఆపండి అని ఆర్తనాదాలు చేసినా వినిపించుకోని ఆ డ్రైవర్ అలాగే బస్సును నడిపారు. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన గడ్చిరోలి జిల్లాలో జరిగింది. ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్పై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ఆర్టీసీ వైస్ ఛైర్మన్ శేఖర్ ఛన్నే తెలిపారు.

MSRTC
విధాత: మహారాష్ట్రలో ఓ ఆర్టీసీ బస్సు రూఫ్ లేచిపోయింది. అందులో ఉన్న 40మంది ప్రయాణికులు ఆపండి… ఆపండి అని ఆర్తనాదాలు చేసినా వినిపించుకోని ఆ డ్రైవర్ అలాగే బస్సును నడిపారు.
దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన గడ్చిరోలి జిల్లాలో జరిగింది.
ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్పై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ఆర్టీసీ వైస్ ఛైర్మన్ శేఖర్ ఛన్నే తెలిపారు.