Ambani | ఉద్యోగికి రూ.1500 కోట్ల.. భ‌వ‌నాన్ని బ‌హుక‌రించిన ముకేశ్ అంబానీ

Mukesh Ambani విధాత‌: ముకేష్ అంబానీ(Mukesh Ambani) భార‌త‌దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆయ‌న కంపెనీల్లో ల‌క్ష‌లాది మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. ఆ ఉద్యోగుల్లో అత్యంత విశ్వ‌స‌నీయ‌త క‌లిగిన ఉద్యోగి మ‌నోజ్ మోడీకి ముకేశ్ అంబానీ ఎవ‌రూ ఊహించ‌ని బ‌హుమ‌తిని అందించి, అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌లో ప‌ని చేస్తున్న‌ మ‌నోజ్ మోడీని ముకేశ్ అంబానీ రైట్ హ్యాండ్‌గా పిలుస్తారు. ఎంతో విశ్వ‌స‌నీయ‌త క‌లిగిన మ‌నోజ్ మోడీకి రూ. 1500 కోట్ల విలువ చేసే 22 అంత‌స్తుల […]

  • Publish Date - April 26, 2023 / 06:50 AM IST

Mukesh Ambani

విధాత‌: ముకేష్ అంబానీ(Mukesh Ambani) భార‌త‌దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆయ‌న కంపెనీల్లో ల‌క్ష‌లాది మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. ఆ ఉద్యోగుల్లో అత్యంత విశ్వ‌స‌నీయ‌త క‌లిగిన ఉద్యోగి మ‌నోజ్ మోడీకి ముకేశ్ అంబానీ ఎవ‌రూ ఊహించ‌ని బ‌హుమ‌తిని అందించి, అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌లో ప‌ని చేస్తున్న‌ మ‌నోజ్ మోడీని ముకేశ్ అంబానీ రైట్ హ్యాండ్‌గా పిలుస్తారు. ఎంతో విశ్వ‌స‌నీయ‌త క‌లిగిన మ‌నోజ్ మోడీకి రూ. 1500 కోట్ల విలువ చేసే 22 అంత‌స్తుల భ‌వ‌నాన్ని ముకేశ్ అంబానీ బ‌హుక‌రించారు. ఈ భ‌వ‌నం ముంబైలోని నేపియ‌న్ సీ రోడ్ ఏరియాలో ఉంది.

ఈ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాన్ని అంబానీ మ‌నోజ్ మోడీకి కొద్ది నెల‌ల క్రితం బ‌హుక‌రించిన‌ట్లు స‌మాచారం. మ‌ల్టీ బిలియ‌న్ డాల‌ర్ల ఒప్పందంలో మ‌నోజ్ మోడీ కీల‌క‌పాత్ర పోషిస్తారు. రిల‌య‌న్స్ రిటైల్ అండ్ రిల‌య‌న్స్ జియో సంస్థ‌ల‌కు ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

భ‌వ‌నం ప్ర‌త్యేక‌త‌లివే..

22 అంత‌స్తుల ఈ భ‌వ‌నాన్ని త‌లాతి అండ్ పార్ట్‌న‌ర్స్ ఎల్ఎల్‌పీ డిజైన్ చేసింది. ఈ భ‌వ‌నానికి సంబంధించిన‌ ఫ‌ర్నీచ‌ర్‌ను ఇటలీ నుంచి తెప్పించారు. అంబానీ బ‌హుక‌రించిన ఈ భ‌వ‌నం పేరు వృందావ‌న్. నేపియ‌న్ సీ రోడ్డులో ఒక చ‌ద‌ర‌పు అడుగు రూ. 45,100 నుంచి రూ. 70,600 ఖ‌రీదు చేస్తుంది. ఈ భ‌వ‌నం మొత్తం 1.7 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మిత‌మై ఉంది. ప్ర‌తి అంత‌స్తు 8 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మిత‌మై ఉంది.