బెంగళూరు ఎయిర్‌పోర్ట్ రోడ్డులో కార్ల ఢీ
కర్ణాటక రాజధాని బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టు రోడ్డుపై దొడ్డజాల ప్రాంతంలో ఉదయం వేళ పలు వాహనాలు ఢీకొన్నాయి

- ఒకదాని వెంట మరొకటి వెనుక ముందు టక్కర్లు
- పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్.. వైరల్ అయిన వీడియోలు
విధాత: కర్ణాటక రాజధాని బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టు రోడ్డుపై దొడ్డజాల ప్రాంతంలో ఉదయం వేళ పలు వాహనాలు ఢీకొన్నాయి. దట్టమైన పొంగ మంచు కారణంగా ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తున్నది. ఒకదాని వెంట మరొకటి కార్లు పరస్పరం ఢీకొట్టడంతో కార్లు కుప్పగా పేరుకుపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది.
సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అనేక కార్ల ముందు వెనుక భాగాలు ధ్వంసమైనట్టు చిత్రాల్లో కనిపిస్తున్నది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలు తొలగించారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.