ములుగు: టీచర్ల మధ్య వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

కొట్టి పోలీసులకు అప్పగింత సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన ఇద్దరు టీచర్లు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టు పట్టుకొని దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంభందించిన వీడియో వైరల్‌గా మారింది. విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్‌లో కుక్కల నాగేందర్, మరో మహిళ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నాది. మహిళ టీచర్ భర్త మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా […]

  • By: krs    latest    Feb 22, 2023 4:11 AM IST
ములుగు: టీచర్ల మధ్య వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
  • కొట్టి పోలీసులకు అప్పగింత

సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన ఇద్దరు టీచర్లు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టు పట్టుకొని దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంభందించిన వీడియో వైరల్‌గా మారింది.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్‌లో కుక్కల నాగేందర్, మరో మహిళ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నాది.

మహిళ టీచర్ భర్త మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. వీరి వివాహేతర సంబంధం విషయం తెలిసి గతంలో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళా టీచర్ ను మంగపేట నుంచి కొత్త బెస్తగూడెం పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపినా వీరిద్దరూ తీరు మార్చుకోలేదు.

అదును చూసి బంధించిన భర్త

సోమవారం హాలీ డే రావడంతో భార్య, కూతురిని చూసేందుకు భర్త మంగపేటకు వచ్చాడు. ఈ క్రమంలో నాగేందర్, మహిళా టీచర్‌కు ఫోన్ చేయగా ఆమె భర్త లిఫ్ట్ చేశాడు. టీచర్‌ భర్త హాలో అనకముందే ‘నేను వస్తున్నా.. తలుపు తీసి ఉంచాలి’ అని నాగేందర్ చెప్పాడు. ఇదే అదునుగా అప్రమత్తమైన కానిస్టేబుల్ భార్యకు విషయం చెప్పకుండా చివరి గదిని లాక్ చేసి, ముందు తలుపులు తీసి ఉంచి బాత్రూమ్‌లో దాక్కున్నాడు.

నాగేందర్ రాత్రి ఇంటికి లోపలికి రాగానే బయటి నుంచి తాళం వేశాడు. అనంతరం కొత్తగూడ మండలంలోని బంధువులకు సమాచారం ఇచ్చి టీచర్‌ నాగేందర్‌కు దేహశుద్ధి చేసి బంధించి పోలీసులకు అప్పగించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.