ఇక సంపాదించేది సమాజానికే: చిరు

విధాత: మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ హోదాలో టాలీవుడ్‌లో వెలిగిపోతున్న సమయంలోనే సమాజం గురించి బాగా ఆలోచించారు. తన శక్తికి తగ్గట్టుగా ఆనాడే చిరంజీవి ఐ బ్యాంక్, చిరంజీవి బ్లడ్ బ్యాంకులను స్థాపించి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కోట్ల రూపాయల విరాళాలతో ఆయన కరోనా సమయంలో ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇక సినీ కార్మికులకు అవసరమైన […]

  • By: krs    latest    Dec 27, 2022 5:04 AM IST
ఇక సంపాదించేది సమాజానికే: చిరు

విధాత: మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ హోదాలో టాలీవుడ్‌లో వెలిగిపోతున్న సమయంలోనే సమాజం గురించి బాగా ఆలోచించారు. తన శక్తికి తగ్గట్టుగా ఆనాడే చిరంజీవి ఐ బ్యాంక్, చిరంజీవి బ్లడ్ బ్యాంకులను స్థాపించి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

కోట్ల రూపాయల విరాళాలతో ఆయన కరోనా సమయంలో ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇక సినీ కార్మికులకు అవసరమైన పలు సేవా కార్యక్రమాలను ఆయన కరోనా సమయంలో ముందుండి నడిపించారు. భవిష్యత్తులో కూడా తన సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించాలని ఆయన భావిస్తున్నారు. చారిటీపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఆయన మాట్లాడుతూ.. ఇన్నాళ్లు కుటుంబం గురించి ఆలోచించాను. ఇక సమాజానికి తిరిగి ఇవ్వడం మీద దృష్టి పెడతాను. ఎంతో మంది స్టార్లు, గొప్ప నటులు, దర్శక నిర్మాతలు చివరి దశలో చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు పడటం చూశాను. పాపం వారు ఎంత సంపాదించినా చివరికి ఏమీ కూడబెట్టుకోలేకపోయారు. అందుకే నా కుటుంబానికి ఆస్తులు సంపాదించి పెట్టాలి.. అన్నట్లుగా మొదట్లో ఆలోచించేవాడిని.

అలాంటి పరిస్థితి మనకు రాకూడదు అని జాగ్రత్త పడేవాడిని. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. పిల్లలందరూ జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. ఇప్పుడు వారి కోసం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. భగవంతుడు అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.

కీర్తి, గ్లామర్ శాశ్వతం కాదు.. వ్యక్తిత్వమే శాశ్వతం.. ఇకపై నా జీవితం చారిటీకే అంకితం. ఎంతైనా దానం చేస్తాను. సినిమాల ద్వారా వస్తున్న డబ్బు కూడా చారిటీకే ఉపయోగిస్తానని చిరంజీవి అంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఆయ‌న‌ నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’ అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు.