Naga Chaitanya | సినిమా చూస్తుండ‌గా.. సడన్‌గా ఖుషి ట్రైల‌ర్! వెంటనే బ‌య‌ట‌కు వ‌చ్చేసిన నాగ చైత‌న్య‌

Naga Chaitanya | ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య, స‌మంత 2021లో డైవ‌ర్స్ తీసుకొని ఎవ‌రి దారులు వారు చూసుకున్నారు. వీరు విడిపోయి రెండేళ్లు అవుతున్నా కూడా ఇద్ద‌రికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. ఈ వార్త‌ల‌పై కొన్ని సార్లు వారు స్పందించిన, మ‌రికొన్ని సార్లు ఎలాంటి స్పంద‌న ఉండ‌దు. అయితే తాజాగా నాగ చైత‌న్య‌, స‌మంత‌కి సంబంధించిన ఓ వార్త గ‌త రెండు రోజులుగా సామాజిక మాధ్య‌మాల‌లో తెగ […]

  • By: sn    latest    Aug 29, 2023 4:31 PM IST
Naga Chaitanya | సినిమా చూస్తుండ‌గా.. సడన్‌గా ఖుషి ట్రైల‌ర్! వెంటనే బ‌య‌ట‌కు వ‌చ్చేసిన నాగ చైత‌న్య‌

Naga Chaitanya |

ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య, స‌మంత 2021లో డైవ‌ర్స్ తీసుకొని ఎవ‌రి దారులు వారు చూసుకున్నారు. వీరు విడిపోయి రెండేళ్లు అవుతున్నా కూడా ఇద్ద‌రికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. ఈ వార్త‌ల‌పై కొన్ని సార్లు వారు స్పందించిన, మ‌రికొన్ని సార్లు ఎలాంటి స్పంద‌న ఉండ‌దు.

అయితే తాజాగా నాగ చైత‌న్య‌, స‌మంత‌కి సంబంధించిన ఓ వార్త గ‌త రెండు రోజులుగా సామాజిక మాధ్య‌మాల‌లో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ విష‌యం నాగ చైత‌న్య దృష్టికి రాగా, దానిని నాగ‌చైత‌న్య ఖండించాడు. స‌ద‌రు మీడియా సంస్థ‌ల‌కి కూడా ఆ వార్త స‌రి చేయ‌మ‌ని సూచించాడ‌ట‌.

ఇటీవల యాంక‌ర్ రష్మీ గౌతమ్ ‘బాయ్స్ హాస్టల్’ అనే చిత్రం విడుదల కాగా, ఈ సినిమా రిలీజ్‌కి ముందు కొందరు సెలబ్రిటీల కోసం ప్రీమియర్ ప్రదర్శించారట. ఈ చిత్రం చూడడానికి నాగ చైతన్యని కూడా ఇన్వైట్ చేయ‌గా, ఆయ‌న ప్రీమియర్ చూస్తుండగా ఇంటర్వెల్ లో విజయ్ దేవరకొండ, నాగ చైతన్య న‌టించిన ఖుషి ట్రైలర్ ప్రదర్శిత‌మైంద‌ట‌.

అప్పుడు అస‌హ‌నంతో చైతు అక్కడి నుండి వెళ్లిపోయాడ‌ని వార్త‌లు వచ్చాయి. ఈ రూమ‌ర్స్ గురించి ఆంగ్ల మీడియాతో మాట్లాడిన నాగ చైతన్య‌.. తాను థియేటర్ నుంచి వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవమని, కావాలని సృష్టించిన రూమర్స్ అని చెప్పుకొచ్చారు. ఆ త‌ప్పుడు వార్త‌లు నా దృష్టికి రావ‌డంతో వాటిని స‌రిచేయాలంటూ స‌ద‌రు మీడియాకి కూడా నాగ చైతన్య సూచించాడ‌ట‌.

చివ‌రిగా క‌స్ట‌డీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి అభిమానుల‌ని నిరాశ‌ ప‌ర‌చిన నాగ చైత‌న్య ఇప్పుడు మంచి హిట్ అందుకునేందుకు కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం కార్తికేయ 2 డైరెక్టర్ చందు ముండేటి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తుండ‌గా, ఇందులో చైతు మత్స్యకార యువకుడిగా నటించ బోతున్నట్లు తెలుస్తోంది. త‌న పాత్ర కోసం చైతు సముద్రంలో పడవ నడిపే ట్రైనింగ్ కూడా తీసుకుంటు న్నట్టు తెలుస్తుంది. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక‌గా న‌టించ‌నుంద‌ని టాక్.