నేడు నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభం

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్ నేడు నాగోల్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. సుమారు రూ.143 కోట్ల వ్యయంతో నాగోల్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేశారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం అయితే ఉప్పల్‌ - ఎల్బీ నగర్‌ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు చాలావరకు తొలిగి పోనున్నయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ కార్యక్రమం ద్వారా చేపట్టిన ఈ ఫ్లైఓవర్‌ను బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నారు. నాగోల్ ఫ్లైఓవర్‌కు యుటిలిటీ […]

  • By: krs    latest    Oct 26, 2022 1:15 AM IST
నేడు నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభం

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్ నేడు నాగోల్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. సుమారు రూ.143 కోట్ల వ్యయంతో నాగోల్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేశారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం అయితే ఉప్పల్‌ – ఎల్బీ నగర్‌ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు చాలావరకు తొలిగి పోనున్నయి.

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ కార్యక్రమం ద్వారా చేపట్టిన ఈ ఫ్లైఓవర్‌ను బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నారు.

నాగోల్ ఫ్లైఓవర్‌కు యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ, ప్రాజెక్టుతో కలిపి మొత్తం రూ.143.58 కోట్లు ఖర్చు అయింది. 990 మీటర్ల పొడవుతో 6 లైన్ల బై డైరెక్షన్‌తో దీన్ని నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌తో ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు సిగ్నల్ ఫ్రీగా ప్రయాణించవచ్చు.