Nalgonda: పార్టీ బలోపేతానికి బూత్ కమిటీలే కీలకం: BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శృతి
విధాత: బిజెపి పార్టీ సంస్థాగత బలోపేతానికి బూత్ కమిటీల నిర్మాణం కీలకమని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి అన్నారు. మంగళవారం బీజేపి నల్గొండ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బూత్ సశక్తికరణ్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతానికి బూత్ కమిటీలే కీలకం అన్నారు. తెలంగాణలో బిజెపి పార్టీ బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం […]

విధాత: బిజెపి పార్టీ సంస్థాగత బలోపేతానికి బూత్ కమిటీల నిర్మాణం కీలకమని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి అన్నారు. మంగళవారం బీజేపి నల్గొండ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బూత్ సశక్తికరణ్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పార్టీ బలోపేతానికి బూత్ కమిటీలే కీలకం అన్నారు. తెలంగాణలో బిజెపి పార్టీ బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో అన్ని మండల కమిటీలు, వివిధ మోర్చాల కమిటీలు బూత్ స్థాయిలో బాగా పనిచేస్తున్నాయన్నాని, అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
నల్గొండ జిల్లాలో రాబోయే ఎన్నికలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆశావహులు ఎవరైతే వున్నారో వారు బూత్ స్థాయిలోకి దూసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేటి వరకు నెరవేర్చలేదని, వాటిని ప్రజలకు వివరించి చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. ఇంకా జిల్లాలో కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో నిర్మాణం కాని కమిటీలను కూడా పూర్తి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఆర్.ప్రదీప్ కుమార్, బీజేపి రాష్ట్ర కార్యదర్శి మాదగొని శ్రీనివాస్ గౌడ్, జిల్లా సహా ఇన్‌చార్జీ గోపి, బీజేపి సీనియర్ నాయకులు ఓరుగంటి రాములు, బిజేపీ కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి, మిర్యాల గూడ ప్రభారి సినీనటి కవిత , కే.యాదగిరి రెడ్డీ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ కుమార్, కంకణాల నివేదిత రెడ్డీ , కన్మంతరెడ్డీ శ్రీదేవిరెడ్డీ,
జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, శనగొని రాములు, బీజేపి జిల్లా ఉపాధ్యక్షులు దాసోజు
యాదగిరా చారి, బీజేపి జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు వివిధ నియోజక వర్గ అసెంబ్లీ కన్వీనర్లు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చల అధ్యక్షులు , ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.