ఆశావాహుల జోష్.. బండకు విషెస్..!

విధాత: నల్గొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నల్గొండ సెగ్మెంట్ బీఆర్ఎస్ టికెట్ ఆశావాహుల సందడికి వేదిక య్యాయి. ముందుగా సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన అనుచరులతో వెళ్లి బండకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న మరో నేత పిల్లి రామరాజు కూడా తన వర్గీయులతో వేచి ఉండి.. భూపాల్ రెడ్డి బయటకు వచ్చాక తను బండను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గుత్తా అమిత్ […]

  • Publish Date - February 5, 2023 / 10:53 AM IST

విధాత: నల్గొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నల్గొండ సెగ్మెంట్ బీఆర్ఎస్ టికెట్ ఆశావాహుల సందడికి వేదిక య్యాయి. ముందుగా సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన అనుచరులతో వెళ్లి బండకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అప్పటికే అక్కడికి చేరుకున్న మరో నేత పిల్లి రామరాజు కూడా తన వర్గీయులతో వేచి ఉండి.. భూపాల్ రెడ్డి బయటకు వచ్చాక తను బండను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గుత్తా అమిత్ రెడ్డి కూడా బండను కలిసి పుట్టిన రోజు విషెస్ చెప్పారు.

అంతకుముందు బండ స్వయంగా సీనియర్ నాయకులైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలువగా, బండకు గుత్తా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బండకు జిల్లా అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా నల్గొండ సెగ్మెంట్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న ఆశవహులు పోటాపోటీగా ఎవరికి వారు వేర్వేరుగా బండకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లడం ఆ పార్టీలో సాగుతున్న వర్గ పోరుకు నిదర్శనంగా కనిపించింది. ఈ మధ్య నల్గొండ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఏ కార్యక్రమమైనా రాజకీయ చర్చలకు దారి తీస్తుండడంతో నల్లగొండలో అసలు ఏం జరుగుతోందనే చర్చ పెరుగుతోంది.