Nalgonda | నల్గొండ BRSలో వాల్ రైటింగ్ వార్..! పిల్లి రామరాజు బొమ్మలపై సున్నం
కంచర్ల వర్గం పనేనంటున్న పిల్లి! విధాత: నల్గొండ (Nalgonda) అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాల్లో మరోసారి వర్గ పోరు రచ్చకెక్కింది. ఈసారి మాత్రం వాల్ రైటింగ్ వార్ రూపంలో పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (MLA Kancharla Bhupal Reddy) కి, మరో నేత పిల్లి రామరాజు (Pilli Rama Raju)కు మధ్య గ్రూప్ వార్ నెలకొంది. ఇటీవల కంచర్ల భూపాల్ రెడ్డికి అనుకూలంగా నియోజకవర్గంతో పాటు జాతీయ రహదారుల వెంట ఆయన అనుచరులు పెద్ద […]

- కంచర్ల వర్గం పనేనంటున్న పిల్లి!
విధాత: నల్గొండ (Nalgonda) అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాల్లో మరోసారి వర్గ పోరు రచ్చకెక్కింది. ఈసారి మాత్రం వాల్ రైటింగ్ వార్ రూపంలో పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (MLA Kancharla Bhupal Reddy) కి, మరో నేత పిల్లి రామరాజు (Pilli Rama Raju)కు మధ్య గ్రూప్ వార్ నెలకొంది. ఇటీవల కంచర్ల భూపాల్ రెడ్డికి అనుకూలంగా నియోజకవర్గంతో పాటు జాతీయ రహదారుల వెంట ఆయన అనుచరులు పెద్ద ఎత్తున వాల్ రైటింగ్ నిర్వహించారు.
ప్రస్తుతానికి ఎలాంటి ఎన్నికల హడావిడి లేకపోయినా కంచర్ల వర్గం నిర్వహించిన ఈ వాల్ రైటింగ్ వ్యవహారం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది. ఇటీవల కంచర్లపై బీఆర్ఎస్ను వీడుతారని సాగిన ప్రచారాన్ని ఖండించే కోణంలో కంచర్ల వర్గం వాల్ రైటింగ్ చేసి ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు భావించాయి.
ఇదిలా ఉండగా నియోజకవర్గ పరిధిలో కంచర్లకు పోటీగా వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ లక్ష్యంగా హడావిడి చేస్తున్న పిల్లి రామరాజు సైతం తాజాగా నియోజకవర్గ పరిధిలో వాల్ రైటింగ్ చేపట్టారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రైల్వే లైన్ అండర్ ప్రాస్ బ్రిడ్జి గోడలకు పిల్లి రామరాజు తరఫున వాల్ రైటింగ్ చేశారు. రామరాజు బొమ్మలతో కూడిన వాల్ రైటింగ్ చేయగా వాటిపై రాత్రికి రాత్రే తెల్ల రంగు సున్నం పూశారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లి రామరాజు వర్గీయులు కంచర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొంతకాలంగా రామరాజు కార్యక్రమాలపై అక్కసు వెళ్ల గక్కుతున్న కంచర్ల, ఆయన వర్గీయులే రామరాజు చిత్రాలపై సున్నం పూశారని ఆరోపిస్తున్నారు. ఎక్కడెక్కడ అయితే రామరాజు చిత్రాలపై సున్నం పోశారో అక్కడ మళ్లీ సోమవారం రామరాజు చిత్రాలను వేయించారు. కాగా ఈ వివాదం పై రామరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తోటి పార్టీ నాయకులపై అణచివేత నియంతృత్వ విధానాన్ని అనుసరిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి పోస్టర్లపై ఇతర పోస్టర్లను వేయించారని, చకిలం అనిల్ కుమార్ ఫ్లెక్సీల పై వేరే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారని, అదే క్రమంలో నా వాల్ రైటింగ్ పైన, బొమ్మల పైన కూడా సున్నం పోయించడం వెనక కచ్చితంగా కంచర్ల, ఆయన వర్గీయుల ప్రమేయం ఉందని ఆరోపించారు.
ప్రజల్లో నాకు వస్తున్న ఆదరణను సహించలేక నా ఫ్లెక్సీలను చింపి వేయించడం, వాల్ రైటింగ్ చెరి పేయించడం వంటి కవ్వింపు చర్యలకు తన అనుచరులను ఉసిగొల్పుతు కంచర్ల చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని రామరాజు అసహన వ్యక్తం చేశారు. నా వాల్ రైటింగ్ చెరిపివేసిన ఘటనపై విచారణ జరిపి,చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు రామరాజు తెలిపారు.