Nalgonda: నిడమనూరు(గుంటిపల్లి)లో.. యువకుడి దారుణ హత్య
విధాత, నల్గొండ జిల్లా నిడమనూరు మండల గుంటిపల్లి గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నవీన్ (24)అనే యువకున్ని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి నరికి చంపారు. దాడి నుండి తప్పించుకుని మరొక యువకుడు పరారయ్యాడు. ప్రేమ వ్యవహారంలో అమ్మాయి తరుపు బందువులే హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. త్రిపురారం మండలం అన్నారం కు చెందిన ఇరుగు నవీన్ తన బామ్మర్ది వరస అయిన మరో యువకుడితో కలిసి నిడమనూరు మండలం గుంటిపల్లి శివారులో తాళ్లలో […]

విధాత, నల్గొండ జిల్లా నిడమనూరు మండల గుంటిపల్లి గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నవీన్ (24)అనే యువకున్ని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి నరికి చంపారు. దాడి నుండి తప్పించుకుని మరొక యువకుడు పరారయ్యాడు.
ప్రేమ వ్యవహారంలో అమ్మాయి తరుపు బందువులే హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. త్రిపురారం మండలం అన్నారం కు చెందిన ఇరుగు నవీన్ తన బామ్మర్ది వరస అయిన మరో యువకుడితో కలిసి నిడమనూరు మండలం గుంటిపల్లి శివారులో తాళ్లలో కల్లు తాగేందుకు వచ్చారు.
Nalgonda: నిడమనూరు(గుంటిపల్లి)లో.. యువకుడి దారుణ హత్యhttps://t.co/vZbanCYrL2 #nalgonda pic.twitter.com/uhNlclY3IW
— vidhaathanews (@vidhaathanews) April 9, 2023
వారిని అనుసరించిన అమ్మాయి తరపు బంధువులు అదును చూసి నవీన్ పై దాడి చేసి హత్య చేశారు. దళిత వర్గానికి చెందిన నవీన్ తన గ్రామానికి చెందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన వివాదంలో అతని హత్య జరిగినట్లు తెలుస్తుంది.
ఘటనపై నిడమనూరు పోలీసులు విచారణ చేపట్టారు