Red Diaries | లోకేష్ బాటలో రేవంత్.. ఎర్ర డైరీలో పేర్లు

Red Diaries | విధాత‌: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఇప్పుడు తమ మాజీ బాస్ చంద్రబాబు కుమారుడు లోకేష్ బాటలో నడుస్తున్నారా ? అయన ఆలోచనలే ఈయనా అమలు చేస్తున్నారా ? ఏమో అలాగే అనిపిస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం యువగళం పాదయాత్రలో భాగంగా జిల్లాలకు వెళుతున్న లోకేష్ ఇప్పుడు అధికారులు, ఇంకా తమను బాగా ఇబ్బంది పెడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమను, తమ […]

Red Diaries | లోకేష్ బాటలో రేవంత్.. ఎర్ర డైరీలో పేర్లు

Red Diaries |

విధాత‌: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఇప్పుడు తమ మాజీ బాస్ చంద్రబాబు కుమారుడు లోకేష్ బాటలో నడుస్తున్నారా ? అయన ఆలోచనలే ఈయనా అమలు చేస్తున్నారా ? ఏమో అలాగే అనిపిస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం యువగళం పాదయాత్రలో భాగంగా జిల్లాలకు వెళుతున్న లోకేష్ ఇప్పుడు అధికారులు, ఇంకా తమను బాగా ఇబ్బంది పెడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమను, తమ క్యాడర్ ను టార్గెట్ చేసి దాడులు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ, అధికారులకు తాము వచ్చాక సరైన గుణపాఠం చెబుతామ‌ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Lokesh

ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా నాయకులకు హెచ్చరికలు చేస్తూ తాము అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని వెంటాడుతామని, వారి పేర్లు ఎర్ర డైరీలో రాస్తాం అని అంటున్నారు. మొన్న పుంగనూరు లో చంద్రబాబు పర్యటన జరిగినప్పుడు జరిగిన గలాటాలో భాగంగా పలువుగు పోలీసులు గాయపడగా ఎస్పీ రిషాంత్ రెడ్డి కాస్త కఠినంగా మాట్లాడారు. ఎవర్నీ వదిలేది లేదని హెచ్చరించారు. దీంతో అయన పేరును సైతం ఎర్ర డైరీలో రాస్తాం అని లోకేష్ హెచ్చరించారు. దీనికి పోలీస్ అధికారులు సంఘం సైతం తీవ్రంగా ప్రతిస్పందించింది. లోకేష్ అలా మాట్లాడడం తగదు అని హెచ్చరించింది.

ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం అచ్చం అలాగే మాట్లాడుతున్నారు. మొన్న గాంధీ భవన్ లో కార్యకర్తలతో మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ అధికారులు సైతం తమను వేధిస్తున్నారు అని, చెబుతూ తాము సైతం ఎర్ర పుస్తకంలో వారి పేర్లు రాస్తున్నాం అని తాము అధికారంలోకి వస్తే వారి అంతు చూస్తాం అని హెచ్చరించారు. అంటే ఆయన సైతం అచ్చం లోకేష్ బాటలోనే నడుస్తున్నట్లు ఉంది అని కార్యకర్తలు అంటున్నారు.