NASA | సూర్యునికి అత్యంత ద‌గ్గ‌ర‌గా వెళ్లిన పార్క‌ర్ ప్రోబ్‌.. సౌర తుపానులోనూ రెండు రోజుల ప్ర‌యాణం

NASA విధాత‌: మాన‌వ అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకుంది. ప్ర‌చండంగా వెలిగిపోయే సూర్యుని చుట్టూ ఉండే క‌రోనా వ‌ల‌యంలోకి మ‌నిషి త‌యారు చేసిన వ‌స్తువు తొలిసారి ప్ర‌యాణించింది. అదే నాసా (NASA) పంపిన పార్క‌ర్ సోలార్ ప్రోబ్‌ (Parkar Solar Probe) . 2018లో ప్ర‌యోగించిన ఈ ఉప‌గ్ర‌హం సూర్యునికి అత్యంత ద‌గ్గ‌ర‌కు వెళ్లిన మాన‌వ నిర్మిత వ‌స్తువుగా చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది. ఆదిత్యుడికి కేవ‌లం 90 ల‌క్ష‌ల కి.మీ. దూరంలో ఒక సౌర తుపానులో […]

  • By: Somu    latest    Sep 20, 2023 11:09 AM IST
NASA | సూర్యునికి అత్యంత ద‌గ్గ‌ర‌గా వెళ్లిన పార్క‌ర్ ప్రోబ్‌.. సౌర తుపానులోనూ రెండు రోజుల ప్ర‌యాణం

NASA

విధాత‌: మాన‌వ అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకుంది. ప్ర‌చండంగా వెలిగిపోయే సూర్యుని చుట్టూ ఉండే క‌రోనా వ‌ల‌యంలోకి మ‌నిషి త‌యారు చేసిన వ‌స్తువు తొలిసారి ప్ర‌యాణించింది. అదే నాసా (NASA) పంపిన పార్క‌ర్ సోలార్ ప్రోబ్‌ (Parkar Solar Probe) . 2018లో ప్ర‌యోగించిన ఈ ఉప‌గ్ర‌హం సూర్యునికి అత్యంత ద‌గ్గ‌ర‌కు వెళ్లిన మాన‌వ నిర్మిత వ‌స్తువుగా చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది.

ఆదిత్యుడికి కేవ‌లం 90 ల‌క్ష‌ల కి.మీ. దూరంలో ఒక సౌర తుపానులో ఇది రెండు రోజులు ప్ర‌యాణించిం ద‌ని నాసా వెల్ల‌డించింది. ఈ దూరం చూడ‌టానికి ఎక్కువ‌గా క‌నిపిస్తున్నా అంత‌రిక్షం స్కేలులో చూసుకుంటే ఇది చాలా చాలా త‌క్కువ దూర‌మే.

ఉదాహ‌ర‌ణ‌కు సూర్యునికి అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉన్న మెర్క్యురీ 3 కోట్ల కి.మీ. దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అదే మ‌న భూమిని తీసుకుంటే సుమారు 15 కోట్ల కి.మీ దూరంలో ప‌రిభ్ర‌మిస్తుంది. ఈ నెల‌లోనే కొన్ని రోజుల క్రింద‌ట క‌రోనల్ మాస్ ఎజిక్ష‌న్ (సీఎంఈ) ప్రాంతంలో పార్క‌ర్ ప్ర‌యాణించింది.

ఈ అద్భుత ప్ర‌యాణాన్ని పార్క‌ర్ నాసాకు పంప‌గా.. దానిని నాసా సామాజిక మాధ్య‌మాల్లో పంచుకుంది. సీఎంఈ అనేది సూర్యుని నుంచి వెలువ‌డే ప్లాస్మా ఉండే ప్రాంతం. ఇక్క‌డే క‌రోనా వ‌ల‌యాలు ఉంటాయి. సూర్యుని ఉప‌రిత‌లం మీద కంటే ఇక్క‌డే ఎక్కువ‌గా ఉష్ణోగ్ర‌త‌లు ఎందుకు ఎక్కువ ఉంటాయ‌ని శాస్త్రవేత్త‌ల‌కు ఇప్ప‌టికీ అంతు చిక్క‌లేదు.

ఈ విష‌యం క‌నుక్కోవ‌డానికి, సూర్యుని ఆవిర్భావాన్ని అంచ‌నా వేయ‌డానికి పార్క‌ర్ ప్ర‌య‌త్నిస్తోంది. సీఎంఈ అనేది సౌర తుపాను ఏర్ప‌డిన‌పుడు ఉత్తేజితంగా మారుతుంది. ఇది భూమి ఉన్న ద‌శ‌లో ఏర్ప‌డితే.. మ‌న స‌మాచార వ్య‌వ‌స్థ విఫ‌లం చెందుతుంది. అప్పుడ‌ప్పుడూ సోలార్ తుపానులు వ‌చ్చినా తీవ్ర‌త త‌క్కువ ఉంటే మ‌న భూ అయ‌స్కాంత వ‌ల‌యం వాటి నుంచి ర‌క్షిస్తుంది.

ప్ర‌స్తుతం పార్క‌ర్ క‌నుగొన్న దాని ప్ర‌కారం.. ఈ సీఎంఈ ప్రాంతంలో అణువులు సెక‌నుకు 1350 కి.మీ. వేగంతో ప్ర‌యాణిస్తున్న‌ట్లు తెలుస్తోంది. పార్క‌ర్ ప్ర‌స్తుతం ప్ర‌యాణించిన సౌర తుపాను సూర్యునికి ఆవ‌ల జ‌రిగింది. అదే మ‌న వైపు జ‌రిగి ఉంటే భారీ ఆస్తి న‌ష్టం సంభ‌వించి ఉండేది.