Ashes Series:101 టెస్టుల తర్వాత అతను లేకుండా యాషెస్ టెస్ట్ సిరీస్.. గాయంతో సిరీస్ నుండి ఔట్
Ashes Series: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరేట్ అనే విషయం మనందరికి తెలిసిందే. 2021 టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా, ఇటీవల టీమిండియాని ఓడించి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కూడా గెలుచుకుంది.ఇక త్వరలో ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో కూడా ఆస్ట్రేలియా వన్ ఆఫ్ ది ఫేవరెట్ గా మారింది. వారి ఆధిపత్యానికి ముఖ్య కారణం డెడికేషన్ అని చెప్పాలి. అందరు సమిష్టి కృషితో ఆడుతున్న నేపథ్యంలోనే ఆ జట్టు […]

Ashes Series: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరేట్ అనే విషయం మనందరికి తెలిసిందే. 2021 టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా, ఇటీవల టీమిండియాని ఓడించి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కూడా గెలుచుకుంది.ఇక త్వరలో ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో కూడా ఆస్ట్రేలియా వన్ ఆఫ్ ది ఫేవరెట్ గా మారింది. వారి ఆధిపత్యానికి ముఖ్య కారణం డెడికేషన్ అని చెప్పాలి. అందరు సమిష్టి కృషితో ఆడుతున్న నేపథ్యంలోనే ఆ జట్టు అద్భుత ఫలితాలు సాధిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే ఇంగ్లండ్‌పై రెండు విజయాలు సాధించి లీడ్‌లో నిలిచింది ఆసీస్.
యాషెస్ సిరీస్ 2023 టోర్నీలో భాగంగా లార్డ్స్ టెస్టులో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. మోకాలి గాయంతో సరిగ్గా నడవలేక, ఊత కర్రల సాయంతో స్టేడియానికి రావడం అందని ఆశ్చర్యపరచింది కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా వేరే ఆటగాడిని ఆడే అవకాశం ఉన్నా కూడా నాథన్ లియాన్ ని కొనసాగించారు. అయితే అతను ఇంగ్లండ్ బౌలర్స్ పదునైన బంతులు ఎదుర్కొంటూ పట్టు వదలకుండా 13 బంతులు ఫేస్ చేసాడు. అందులో ఓ బౌండరీ బాది స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న నాథన్ లియాన్, యాషెస్ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకి దూరం అయ్యాడు.
అతను గాయం నుండి కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు సూచించడంతో నాథన్‌ని జట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా.. ఈ క్రమంలో 101 మ్యాచుల తర్వాత నాథన్ లియాన్ లేకుండా ఆస్ట్రేలియా బరిలోకి దిగబోతుంది. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన నాథన్ లియాన్, వరుసగా 100 టెస్టులు ఆడిన తొలి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.. యాషెస్ సిరీస్‌లో నాథన్ లియాన్ తొలి టెస్టులో 8 వికెట్లు తీయగా, రెండో టెస్టులో 13 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌తో గాయం వలన ఒక్క ఓవర్ కూడా వేయలేదు. అతను త్వరగా కోలుకొని త్వరగా క్రికెట్‌లోకి అడుగు పెట్టాలని నాథన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.