‘ఎన్నో రాత్రులు వస్తాయి గానీ’.. పాట రీమిక్స్ చేస్తున్న అబ్బాయి!

విధాత: నందమూరి కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే ఆయన చిత్రాలు విభిన్నంగా ఉంటాయి. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ ఈయనకు బాలకృష్ణ, ఎన్టీఆర్ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఇంకా రాలేదు. అత‌నొక్క‌డే, హరే రామ్, పటాస్, నా నువ్వే, 118 వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. తాజాగా ఆయన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో బింబిసార వంటి ఇండస్ట్రియల్ హిట్ తర్వాత అమిగోస్ చిత్రం చేస్తున్నారు, బింబిసార ఏకంగా 50 కోట్లను […]

  • Publish Date - January 27, 2023 / 07:07 AM IST

విధాత: నందమూరి కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే ఆయన చిత్రాలు విభిన్నంగా ఉంటాయి. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ ఈయనకు బాలకృష్ణ, ఎన్టీఆర్ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఇంకా రాలేదు. అత‌నొక్క‌డే, హరే రామ్, పటాస్, నా నువ్వే, 118 వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి.

తాజాగా ఆయన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో బింబిసార వంటి ఇండస్ట్రియల్ హిట్ తర్వాత అమిగోస్ చిత్రం చేస్తున్నారు, బింబిసార ఏకంగా 50 కోట్లను వసూలు చేసింది. కళ్యాణ్‌రామ్‌కు ఇది కనీవిని ఎరుగని కలెక్షన్ అని చెప్పవచ్చు. దీనికి కూడా కొత్త దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించారు. ఒక అమిగోస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న కళ్యాణ్ రామ్ ఇందులో త్విపాత్రాభిన‌యం చేస్తున్నారు.

మైకేల్, సిద్ధార్థ్, మంజునాథ్ అనే మూడు పాత్రలలో ఆయన తనదైన మేకవర్‌తో ఎంతగానో కష్టపడ్డారని ఈ చిత్రం టీజర్‌ను చూస్తేనే అర్థమవుతుంది. ఒకే పోలికతో ఉండే ముగ్గురు వ్యక్తుల కథలు దర్శకుడు రాజేందర్ రెడ్డి ఎంతో ఆసక్తికరంగా తీశాడని తెలుస్తోంది.

కాగా ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ తన బాబాయ్‌ నందమూరి బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రం లోని సూపర్ హిట్ సాంగ్ ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదీ వెన్నెలమ్మ అనే పాటను రీమిక్స్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నందమూరి అభిమానులు నుంచి అద్భుత స్పందన వస్తుంది. అత్యద్భుతమైన ఈ పాటను కాస్త మార్చి లిరిక్స్‌లో మార్పు లేకుండా రీమిక్స్ చేయ బోతున్నట్టు తెలుస్తోంది.

ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా ఆ పాటను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తే కచ్చితంగా అది అమిగోస్‌కు ప్లస్ అవుతుంది. మరి అమిగోస్‌తో క‌ళ్యాణ్ రామ్ బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌ను తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి..!