సరొగసి: నయన్, విఘ్నేష్‌‌‌లు.. ఎలాంటి తప్పు చేయలేదట!

విధాత, సినిమా: ఏమండోయ్.. ఇది విన్నారా? నిన్నటి వరకు నయన్, విఘ్నేష్‌లపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని చెప్పిన తమిళ నాడు ప్రభుత్వం.. తాజాగా వారి తప్పేం లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. నయనతార, విఘ్నేష్ శివన్‌ల పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా కాకుండానే వారికి ఇద్దరు పిల్లలు కలగడంపై తమిళ నాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. వివరణ ఇవ్వాలంటూ.. ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఓ 10, 15 […]

సరొగసి: నయన్, విఘ్నేష్‌‌‌లు.. ఎలాంటి తప్పు చేయలేదట!

విధాత, సినిమా: ఏమండోయ్.. ఇది విన్నారా? నిన్నటి వరకు నయన్, విఘ్నేష్‌లపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని చెప్పిన తమిళ నాడు ప్రభుత్వం.. తాజాగా వారి తప్పేం లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. నయనతార, విఘ్నేష్ శివన్‌ల పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా కాకుండానే వారికి ఇద్దరు పిల్లలు కలగడంపై తమిళ నాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. వివరణ ఇవ్వాలంటూ.. ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ ఓ 10, 15 రోజుల పాటు కష్టపడి ఇచ్చిన రిపోర్ట్‌లో.. వారిద్దరూ సరొగసి కోసం ICMR మార్గదర్శకాలను అనుసరించినట్లుగా ఉందని, వారేం తప్పు చేయలేదని.. తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది.

దీంతో నయన్, విక్కీలకు భారీ ఊరట లభించగా.. ఇదంతా చూస్తున్న వారికి మాత్రం ఇదేదో పెద్ద గ్యాంబ్లింగ్ మాదిరిగా అనిపిస్తుందనడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరమే లేదు. అందుకే అంటుంటారు డబ్బులుంటే.. ఇవాళ ఏ పనైనా జరుగుతుందనేది.