కాళేశ్వరం అక్రమాలపై ఎన్‌డీఎస్ఏ విచారణ

కాళేశ్వరం అక్రమాలపై విచారణ చేసేందుకు ఎన్‌డీఎస్‌ఏ బృందం బుధవారం మరోసారి రాష్ట్రంలో పర్యటించింది.

  • By: Somu    latest    Mar 20, 2024 11:31 AM IST
కాళేశ్వరం అక్రమాలపై ఎన్‌డీఎస్ఏ విచారణ

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం అక్రమాలపై విచారణ చేసేందుకు ఎన్‌డీఎస్‌ఏ బృందం బుధవారం మరోసారి రాష్ట్రంలో పర్యటించింది. చంద్రశేఖర్ అయ్యర్ సారధ్యంలోని ఎన్‌డీఎస్‌ఏ కమిటీ ముందుగా ఎర్రమంజిల్ జల సౌదాకి చేరుకుని కాళేశ్వరం ఈఎన్‌సీ హరి రామ్‌తో భేటీ అయ్యింది.


అలాగే తమ సమావేశానికి హాజరుకావాలని ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ ఎల్‌ఆండ్‌టీ ప్రతినిధులను పిలిపించింది. ఈఎంసీ జనరల్, డిజైన్స్, హైడ్రాలజీ అధికారులతోనూ వారు భేటీ అయ్యారు. మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌ను కూడా ఎన్‌డీఎస్‌ఏ కమిటీ పిలిపించింది. వారందరితో కమిటీ విడివిడిగా భేటీ అయ్యి కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్మాణాలు జరిగిన తీరుపై విచారణ కొనసాగిస్తుంది.