Neelakurinji flower: 12 సంవత్సరాలకు ఒకసారి వికసించే అరుదైన పుష్పం.. ఈ చెట్లు ఎక్కడ ఉంటాయో తెలుసా?

Neelakurinji flower: ఎన్నో వింతలు, విశేషాలకు ప్రకృతి ఆలవాలంగా ఉంది. అయితే 12 సంవత్సరాలకు ఒకసారి వికసించే అరుదైన పుష్పం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. నీలకురింజి అనే ఒక అరుదైన పుష్పం పుష్కరకాలానికి ఒకసారి మాత్రమే వికసించి పర్యాటకులను ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.
మనదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో ఈ పుష్పం 12 ఏండ్లకు ఒకసారి కనిపిస్తూ ఉంటుంది. ఈ పుష్పం శాస్త్రీయ నామం “స్ట్రోబిలాంథెస్ కుంతియానా” అనే. దీన్ని తమిళంలో కురింజి, కన్నడలో గురిగే, మలయాళంలో మలయాళం అని కూడా పిలుస్తుంటారు.
నీలకురింజి మొక్కలకు 12 ఏండ్లకు ఒకసారి మాత్రమే పుష్పాలు వికసిస్తాయి. ఆ తర్వాత ఆ మొక్క చనిపోతుంది. ఈ మొక్కలు సాధారణంగా 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. ఈ పూలతో పశ్చిమ కనుమలు కొత్త అందాన్ని సంతరించుకుంటాయి.
పర్యాటకానికి ఒక ఆకర్షణగా నిలుస్తాయి. గిరిజనుల జీవితంలో ఈ పుష్పాలు ఒక భాగం కావడం గమనార్హం. వారు ఈ పూల పూయడాన్ని బట్టి వారి వయస్సు, ఇతర ముఖ్యమైన సంఘటనలను లెక్కించుకుంటూ ఉంటారు.
ఈ పుష్పం దాని నీలి-ఊదా రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పూలు వికసించినప్పుడు పశ్చిమ కనుమలు మొత్తం నీలి రంగు కార్పెట్‌తో కప్పబడినట్లు కనిపిస్తాయి. ఇది పర్యాటకులను, ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంది.