New Cabinet Ministers | 12న కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ..? ఇన్ ఎవరో.. అవుట్ ఎవరో..!

New Cabinet Ministers తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి బెర్త్‌..? బండి సంజయ్‌కు పిలుపు !! విధాత : కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ప్రధానీ నరేంద్ర మోడీ సహా బీజేపీ కేంద్ర నాయకత్వం చేపట్టిన సుదీర్ఘ కసరత్తు తుది దశకు చేరింది. ప్రధాని మోడీ ఈనెల 13,14 తేదిలలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్న నేపధ్యంలో అంతకుముందుగానే ఈ నెల 12న కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. మంత్రివర్గ మార్పులు, చేర్పులపై ప్రధాని […]

  • Publish Date - July 10, 2023 / 02:40 PM IST
New Cabinet Ministers
  • తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి బెర్త్‌..? బండి సంజయ్‌కు పిలుపు !!

విధాత : కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ప్రధానీ నరేంద్ర మోడీ సహా బీజేపీ కేంద్ర నాయకత్వం చేపట్టిన సుదీర్ఘ కసరత్తు తుది దశకు చేరింది. ప్రధాని మోడీ ఈనెల 13,14 తేదిలలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్న నేపధ్యంలో అంతకుముందుగానే ఈ నెల 12న కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేస్తారని పార్టీ వర్గాల సమాచారం.

మంత్రివర్గ మార్పులు, చేర్పులపై ప్రధాని మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జీ బిఎల్‌. సంతోష్ సహా పార్టీ ముఖ్యనేతలు చర్చల ప్రక్రియ పూర్తి చేశారు. గతంలో 2021జూలై 7న నిర్వహించిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా 36 మందికి ఉద్వాసన పలికి 12 మంది కొత్త వారికి స్థానం కల్పించిన మోడీ ఈ దఫా తక్కువ సంఖ్యలోనే మార్పులు, చేర్పులు చేయవచ్చన ఢిల్లీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ప్రస్తుత కేబినెట్‌లోని కొందరు మంత్రులను రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సహా ముందున్న పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో వారిని పార్టీ బాధ్యతలలోకి తీసుకుని, పార్టీ అవసరాల నేపధ్యంలో ఆయా రాష్ట్రాల నుండి కేబినెట్‌లోకి కొత్త ముఖాలను ఎంపిక చేయనున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలలో పార్టీ బలోపేతం కోసం ఇటీవల తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించబడిన ఎంపీ బండి సంజయ్ తో పాటు ఎంపీలు సోయం బాపురావు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ లలో ఒకరిద్ధరిని కేంద్ర కేబినెట్‌లో తీసుకోవచ్చు.

వారిలో బండి సంజయ్‌కే ఎక్కువ అవకాశం ఉంది. బండికి నేడో రేపో ఢిల్లీ నుండి పిలుపు రావచ్చన్న ఉద్ధేశంతో ఆయన అందుబాటులో ఉండటం ఆసక్తికరం. అటు ఆంధ్రప్రదేశ్ నుండి సీఎం రమేష్‌, సోము వీర్రాజుల పేర్లు కేంద్ర కేబీనెట్‌లోకి తీసుకునే విషయమై పరిశీలనలో ఉన్నాయి. మహారాష్ట్ర నుండి ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాలకు, ఎల్‌జేపి నేత చిరాగ్ పాశ్వాన్‌, ఆర్‌ఎల్‌డి నేత జయంత్ చౌదరీకి కేబినెట్ తీసుకుంటారని బీజేపీ వర్గాల కథనం.

కేబినేట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడిగా నియామితులైన జి.కిషన్‌రెడ్డి కేబినెట్ నుండి రిలీవ్ కాక తప్పదు. అలాగే యూపీ ఎన్నికల ఇంచార్జీ నేపధ్యంలో థర్మేంధ్ర ప్రధాన్ తో పాటు, తాజాగా ఎన్నికల ఇంచార్జీలుగా నియామితులైన మంత్రులు ప్రహ్లాద్ జోషి, భూపేంద్ర యాదవ్‌, అశ్వనీ వైష్ణవ్‌, మన్సుక్ మాండవీయలను ఎన్నికల ఇంచార్జీలుగా నియమించడంతో వారు కూడా కేబినెట్ నుండి ఉద్వాసనకు గురయ్యే అవకాశముంది.