BJP | బీజేపీ నుంచి కొత్త ప్రధాని! మోదీ ఈసారి ప్రధాని కాబోరు.. మాజీ గవర్నర్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు

BJP బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని వెల్లడి విధాత: వచ్చే ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండబోరని జమ్ము కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సంచనల వ్యాఖ్యలు చేశారు. ద వైర్‌కు ఇచ్చిన ఇంటర్‌ వ్యూలో BJP, ఆర్‌ఎస్‌ఎస్‌ల పనివిధానం గురించి, అంతర్గతంగా చర్చ గురించి ఆయన చాలా విషయాలు వెల్లడించారు. 2024లో నరేంద్ర మోదీ ప్రధాని కాబోరని సత్యాపాల్‌ మాలిక్‌ చెప్పారు. కొత్త వ్యక్తి ప్రధాని అవుతారని అన్నారు. తనకు రాజకీయ పదవులు […]

  • By: krs    latest    May 04, 2023 10:04 AM IST
BJP | బీజేపీ నుంచి కొత్త ప్రధాని! మోదీ ఈసారి ప్రధాని కాబోరు.. మాజీ గవర్నర్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు

BJP

బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని వెల్లడి

విధాత: వచ్చే ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండబోరని జమ్ము కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సంచనల వ్యాఖ్యలు చేశారు.

ద వైర్‌కు ఇచ్చిన ఇంటర్‌ వ్యూలో BJP, ఆర్‌ఎస్‌ఎస్‌ల పనివిధానం గురించి, అంతర్గతంగా చర్చ గురించి ఆయన చాలా విషయాలు వెల్లడించారు.

2024లో నరేంద్ర మోదీ ప్రధాని కాబోరని సత్యాపాల్‌ మాలిక్‌ చెప్పారు. కొత్త వ్యక్తి ప్రధాని అవుతారని అన్నారు. తనకు రాజకీయ పదవులు అక్కర లేదని మాలిక్‌ చెప్పారు.

నరేంద్ర మోదీ రైతు వ్యతిరేకి అని ఆయన అన్నారు. తాను 2024లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని సత్యపాల్‌ మాలిక్‌ చెప్పారు.