Nipah Virus | కేరళలో నిఫా వైరస్ కల్లోలం.. 7 జోన్లలో లాక్ డౌన్

Nipah Virus | విధాత, తిరువనంత పురం: నిఫా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని కేరళ సర్కార్ కొలికోడ్ జిల్లా సహా 7 జోన్ లలోనూ, సమీప ప్రాంతా ల్లోనూ ముందు జాగ్రత్తగా పాటించ వలసిన నియమాలను ప్రకటించింది. కేరళ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న నిఫా వైరస్ తో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చనిపోయిన ఇరువురు కూడా నిఫా వైరస్ మెదడుకు సోకి, మెదడు ఫంక్షనింగ్ దెబ్బ తినడం ద్వారా […]

  • By: krs    latest    Sep 13, 2023 4:31 PM IST
Nipah Virus | కేరళలో నిఫా వైరస్ కల్లోలం.. 7 జోన్లలో లాక్ డౌన్

Nipah Virus |

విధాత, తిరువనంత పురం: నిఫా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని కేరళ సర్కార్ కొలికోడ్ జిల్లా సహా 7 జోన్ లలోనూ, సమీప ప్రాంతా ల్లోనూ ముందు జాగ్రత్తగా పాటించ వలసిన నియమాలను ప్రకటించింది. కేరళ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న నిఫా వైరస్ తో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చనిపోయిన ఇరువురు కూడా నిఫా వైరస్ మెదడుకు సోకి, మెదడు ఫంక్షనింగ్ దెబ్బ తినడం ద్వారా మృతి చెందారు.

దీనితో ముందు జాగ్రత్త గా ఈ నిఫా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కొన్ని స్కూళ్లను, ఆఫీసులను మూసి వేయించింది. 7 జోన్లను ప్రభావిత ప్రాంతాలుగా పకటించింది. కేరళ ప్రభుత్వ ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఎలర్ట్ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మండావియా కూడా కేరళలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల మరణానికి నిఫా వైరసే కారణం అని దృవీకరించారు.

కోజికోడ్ లోని ఒక ప్రైవేట్ హాస్పటల్ లో ఈ ఇరువురు మృతి చెందారు. చనిపోయిన రెండవ వ్యక్తి బంధువులు నలుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో వారి ట్రీట్మెంట్ నడుస్తున్నది. హాస్పటల్ లోవున్న వారి శాంపిల్స్‌ తీసి టెస్ట్ కొరకు పంపిస్తే, వారిలో ఇరువురికి పాజిటివ్ గా రిపోర్టులు వచ్చాయి. ఇందులో ఒకరు, 9 ఏండ్ల అబ్బాయి, మరొకరు 24 ఏండ్ల యువకుడు. వీరిద్దరూ చనిపోయిన వ్యక్తి బంధువులే. ప్రస్తుతం ఆ అబ్బాయి ప్రైవేట్ హాస్పటల్ లో వెంటిలేషన్ పై ఉన్నారు.

అయితే కేరళ ప్రభుత్వం ఎమర్జెన్సీగా హై-లెవల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈమీటింగ్ లో ఆరోగ్య శాఖ మంత్రి వీనాజార్జ్ పరిస్థితిని సమీక్షించింది. గతంలో కూడా కోజికోడ్ లో 2018, 2021లో రెండు సార్లు నిఫా వైరస్ బయట పడింది. మొదటి సారి 23 కేసులు గుర్తించగా, అందులో 17 గురు మాత్రం దీనితోనే అనారోగ్యం పాలయ్యారని అంటున్నారు.

నిఫా వైరస్ గబ్బిలాలు, పందుల నుండి మనిషి కి సోకుతుందని ఆరోగ్య శాఖ అధికారి ఒకరన్నారు. బుధవారం కేరళ ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు 7జోన్ ల లో కొత్తగా లాక్ డౌన్ వంటి కొన్ని నియమాలను రూపొందించింది. ఈ నియమాలను పాటించడం ద్వారా ఈవైరస్ తో తలపడి ఓడించాలని ప్రజలను ప్రభుత్వం కోరింది.

నిఫా నివారణ సూచనలు

చాలా మందికి నిఫా పాజిటివ్ రిపోర్టులు అందుతున్నందున సమీప జిల్లా లైన కన్నూర్, వాయ్ నాడ్, మల్లాపురం లలో ప్రజలను ముందుగానే ఎలర్ట్ చేశారు. ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని స్కూల్లల్లో ఆన్ –లైన్ క్లాసులను ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి వి. సివన్ కుట్టి, పబ్లిక్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ను ఆదేశించారు. ప్రభావిత 7 గ్రామ పంచాయతుల్లోని 43 వార్డుల్లో ప్రజల రాకపోకలను నిషేధించారు. ప్రభావిత 7 జోన్ లలో ప్రజలు తప్పక దూరాన్ని పాటించాలని, మాస్క్ లు ధరించాలని, సానిటైజర్లు ఉపయోగించాలని కోరారు.