Nizamabad | నిండిన ప్రాజెక్టులు.. కొనసాగుతున్న వరదలు

Nizamabad | విధాత ప్రతినిధి, నిజామాబాద్: మహారాష్ట్రతో పాటు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. గరిష్ట నీటి మట్టం నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతనీటి మట్టం1089 అడుగలుకు చేరుకున్నది. 90 టీఎంసీలకు గాను 84 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 18 గేట్ల ద్వారా 50వేల క్యూసెక్సుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి […]

  • Publish Date - July 28, 2023 / 02:46 PM IST

Nizamabad |

విధాత ప్రతినిధి, నిజామాబాద్: మహారాష్ట్రతో పాటు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. గరిష్ట నీటి మట్టం నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతనీటి మట్టం1089 అడుగలుకు చేరుకున్నది. 90 టీఎంసీలకు గాను 84 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 18 గేట్ల ద్వారా 50వేల క్యూసెక్సుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1405 అడుగులకు గాను ప్రస్తుతం1404.46 గా చేరుకున్నది. నీటి నిల్వ 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం17.022 గా ఉంది. ఎగువ నుండి 48 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో నాలుగు గేట్ల ద్వారా 20 వేల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

కౌలాస్ నాలా ప్రాజెక్ట్

ఎగువ ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలస్ నాలా ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. 2 గేట్ల ద్వారా 5000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 458 అడుగులు కాగ ప్రస్తుతం 455 అడుగులు గా ఉంది. ప్రాజెక్ట్ లోకి 5 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది.