Nizamabad
విధాత, ప్రతినిధి నిజామాబాద్: దేశ ప్రధానిగా నరేంద్ర మోడి 9 యేళ్ల పాలన సుపరిపాలన. అవినీతి లేని పాలన అందించారని, అదే మోడీ లక్ష్యమని కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు ప్రకాష్ జావదేకర్ అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.. కానీ నరేంద్ర మోడి 9 యేళ్ల పాలనలో ఇప్పటి వరకు ఒక్క కేంద్ర మంత్రి పై కూడా ఆవినీతి ఆరోపణలు రాలేదని అయన అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు ప్రకాష్ జావదేకర్ పర్యటించారు. ఆయనతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నరసయ్యలో కలిసి పార్టీ కార్యలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు..
మోడి పాలన సబ్కాసాత్.. సబ్కావికాష్.. అనే నినాదంతో పూర్తిగా ప్రజల కోసం ప్రజల పక్షాన ఉందన్నారు. దేశం కోసం మోడి ఎంతో చేసారు.. 24 గంటలు కష్టపడే వ్యక్తి మాన ప్రధాని అన్నారు.. ఇప్పటికే రైతుల కోసం పీఎం కీసాన్ ద్వారా రైతుల ఖాతాలో ఒక్కోక్కరికి 26 వేల రూపాయలు వేసామని గుర్తు చేశారు.
2014లో వరికి 1360 రూపాయలు మద్దతు దర ఉండేది. ఇప్పుడు 2200 రూపాయలు అందిస్తుంది మోడి సర్కార్. దేశవ్యాప్తంగా అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేని నాయకుడు మోడీజీ అన్నారు.