విధాత: తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ట్విట్టర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. వరుసగా రెండో రోజు పదో తరగతి ప్రశ్నాపత్రం బయటకు రావడంపై రేవంత్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలన గాలికి వదిలేసి రాజకీయ విధ్వంసంలో మునగడంతోనే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని పేర్కొన్నారు.