మునుగోడు నామినేషన్ల ఉపసంహరణ నేటితో ఆఖరు
విధాత: మునుగోడు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనున్నది. నామినేషన్ల దాఖలు, పత్రాల పరిశీలన తర్వాత 14 జిల్లాలకు చెందిన 83 మంది బరిలో ఉన్నారు. ఇందులో ఎంతమంది ఉప సంహరించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల నియమావళి అనుగుణంగా లేని 47 నామినినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బరిలో ఉన్న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ కోసం వివిధ పార్టీల నేతలు బుజ్జగిస్తూ.. ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఫలితంగా కొంతమంది బరిలో నుంచి తప్పుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో 130 మంది 199 […]

విధాత: మునుగోడు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనున్నది. నామినేషన్ల దాఖలు, పత్రాల పరిశీలన తర్వాత 14 జిల్లాలకు చెందిన 83 మంది బరిలో ఉన్నారు. ఇందులో ఎంతమంది ఉప సంహరించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల నియమావళి అనుగుణంగా లేని 47 నామినినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బరిలో ఉన్న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ కోసం వివిధ పార్టీల నేతలు బుజ్జగిస్తూ.. ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఫలితంగా కొంతమంది బరిలో నుంచి తప్పుకున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో 130 మంది 199 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. గతంలో వాజపేయ్ హయాంలో తమ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలం టూ కేంద్ర ప్రభత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో.. లోక్‌సభ స్థానానికి దాదాపు 400 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆ తర్వాత ప్రస్తుతం 199 సెట్లు దాఖలయ్యాయిని స్థానికులు చెబుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు నేడే చివరి రోజు కావడంతో10-15మంది పోటీ నుంచి తప్పుకుంటారని అని అంటున్నారు. చివరికి పోటీలో 50 మందికైగా బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.