ఎమ్మెల్యేల కోటా రెండు ఎమ్మెల్సీల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌

తెలంగాణ శాసన మండలిలో ఖాళీయైన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

  • Publish Date - January 11, 2024 / 07:43 AM IST

విధాత : తెలంగాణ శాసన మండలిలో ఖాళీయైన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి గురువారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్లను పరిశీలన, 22న ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.


ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నుంచి, పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి బీఆరెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడంతో వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ కావడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల పదవి కాలం 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. ప్రస్తుతం శాసనసభ్యుల కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది. రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతుండటంతో రెండు స్థానాలు కూడా కాంగ్రెస్‌కే దక్కనున్నాయి.