Odisha | ప్రాణాల‌కు తెగించి.. హైవే సైన్ బోర్డుపై పుషప్స్..

Odisha | Viral Video | ఓ వ్య‌క్తి భ‌యంక‌ర‌మైన స్టంట్స్ చేశాడు. అంద‌రూ జిమ్ సెంట‌ర్‌లోనో, ప్లే గ్రౌండ్‌లోనో పుష్ అప్స్ చేస్తే.. ఇత‌ను మాత్రం త‌న ప్రాణాల‌కు తెగించి.. హైవే సైన్ బోర్డు పుష్ అప్స్ చేశాడు. అలా ఆ ర‌హ‌దారి గుండా వెళ్తున్న ప్ర‌యాణికుల, వాహ‌న‌దారుల దృష్టిని ఆక‌ర్షించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని బోల‌న్‌గిర్ జిల్లాలోని ప‌ట్న‌గ‌ర్హ్ హైవేపై ఇనుప రాడ్ల‌తో సైన్ […]

Odisha | ప్రాణాల‌కు తెగించి.. హైవే సైన్ బోర్డుపై పుషప్స్..

Odisha | Viral Video |

ఓ వ్య‌క్తి భ‌యంక‌ర‌మైన స్టంట్స్ చేశాడు. అంద‌రూ జిమ్ సెంట‌ర్‌లోనో, ప్లే గ్రౌండ్‌లోనో పుష్ అప్స్ చేస్తే.. ఇత‌ను మాత్రం త‌న ప్రాణాల‌కు తెగించి.. హైవే సైన్ బోర్డు పుష్ అప్స్ చేశాడు. అలా ఆ ర‌హ‌దారి గుండా వెళ్తున్న ప్ర‌యాణికుల, వాహ‌న‌దారుల దృష్టిని ఆక‌ర్షించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని బోల‌న్‌గిర్ జిల్లాలోని ప‌ట్న‌గ‌ర్హ్ హైవేపై ఇనుప రాడ్ల‌తో సైన్ బోర్డు ఏర్పాటు చేశాడు. ఇక సైన్ బోర్డుపైకి ఎక్కిన వ్య‌క్తి.. పుష్ అప్స్ చేయ‌డం ప్రారంభించాడు. అత‌న్ని గ‌మ‌నించిన వాహ‌దారులు త‌మ వాహ‌నాల‌ను ఆపి.. వీడియోలు చిత్రీక‌రించ‌డం ప్రారంభించారు.

సైన్ బోర్డుపై స‌ద‌రు వ్య‌క్తి 9 పుష్ అప్స్ చేశాడు. అయితే ఈ వ్య‌క్తి మ‌ద్యం మ‌త్తులో అలా చేసిన‌ట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ వీడియోను సాంబ‌ల్‌పురి మ‌హానీ అనే యూజ‌ర్ త‌న ఇన్‌స్టా గ్రాం ఖాతాలో పోస్టు చేశాడు. ఈ విధంగా చేయాల‌ని తాము ప్ర‌మోట్ చేయ‌డం లేదు. కేవ‌లం స‌ర‌దా కోస‌మే ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన‌ట్లు పేర్కొన్నారు.

ఈ పేద యువ‌కుడికి జిమ్ సెంట‌ర్ ఎక్క‌డుందో తెలియ‌న‌ట్టుంది.. అందుకే సైన్ బోర్డుపై పుష్ అప్స్ చేస్తున్నాడని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు. ఆదివారం జిమ్‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన‌ట్టు ఉన్నారు.. అందుకే మ‌నోడు ఈ హైవేపై పుష్ అప్స్ చేసిన‌ట్లు ఉన్నాడ‌ని మ‌రొక‌రు అన్నారు.