1926 | గాల్లో.. ఒక విమానం నుంచి వెళ్లి.. మ‌రో విమానానికి టైరు బిగించిన మహిళ

1926 | విధాత: గాల్లో రివ్వున దూసుకుపోయే విమానం ఎక్కాలంటే ఇప్ప‌టికీ కొంత‌మందికి బెరుకే. అలాంటిది విమానం వ‌చ్చిన తొలినాళ్లలో ఏకంగా గాల్లో ప్ర‌యాణిస్తున్న ఒక విమానం (plane) నుంచి మ‌రో విమానంపైకి మారాలంటే ఎంత ధైర్యం ఉండాలి? అలాంటి అరుదైన ఫీట్ చేసింది ఓ యువ‌తి. అది ఎందుక‌నేది ఇంకా ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న వీడియోలో.. గాల్లో ఉన్న ఓ యుద్ధ విమానం ల్యాండింగ్ గేర్ (చ‌క్రం) ఊడిపోగా..దానిని స‌రిచేయ‌డానికి ఈ యువ‌తిని పంపుతారు. […]

  • Publish Date - July 8, 2023 / 08:36 AM IST

1926 |

విధాత: గాల్లో రివ్వున దూసుకుపోయే విమానం ఎక్కాలంటే ఇప్ప‌టికీ కొంత‌మందికి బెరుకే. అలాంటిది విమానం వ‌చ్చిన తొలినాళ్లలో ఏకంగా గాల్లో ప్ర‌యాణిస్తున్న ఒక విమానం (plane) నుంచి మ‌రో విమానంపైకి మారాలంటే ఎంత ధైర్యం ఉండాలి? అలాంటి అరుదైన ఫీట్ చేసింది ఓ యువ‌తి. అది ఎందుక‌నేది ఇంకా ఆస‌క్తిక‌రం.

ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న వీడియోలో.. గాల్లో ఉన్న ఓ యుద్ధ విమానం ల్యాండింగ్ గేర్ (చ‌క్రం) ఊడిపోగా..దానిని స‌రిచేయ‌డానికి ఈ యువ‌తిని పంపుతారు. త‌న న‌డుముకు కొత్త చ‌క్రాన్ని బిగించి ఓ చిన్న‌పాటి విమానంలో గాల్లోకి తీసుకెళ్తారు. దాని రెక్క‌ల మీద కాలు జారి పోకుండా నుంచుని ఉంటే.. ప‌క్క నుంచి ల్యాండింగ్ గేర్ దెబ్బ‌తిన్న విమానం వ‌స్తుంది. మెల్ల‌గా దాని రెక్క‌ల‌పై ఎక్కి.. న‌డుచుకుంటూ ఆ ల్యాండింగ్ గేర్ ద‌గ్గ‌ర ఉన్న రాడ్డుపై కూర్చుని ఊడి పోయిన టైర్ స్థానంలో కొత్త టైర్‌ను బిగించేస్తుంది.

అనంత‌రం ఆ విమానం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ అవుతుంది. 1926లో షూట్ చేసిన ఈ వీడియోను వ‌రల్డ్ ఆఫ్ హిస్ట‌రీ అనే ఎకౌంట్ ట్వీట్ చేసింది. దీనిపై యూజ‌ర్లు ప‌లు విధాలుగా స్పందిస్తున్నారు. నేనైతే ఏ వ‌య‌సులోనూ ఇలాంటి ప‌ని చేయ‌లేన‌ని పేర్కొన‌గా.. ఈమెకు ఎన్ని గుండెలో అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. మ‌రి కొంత‌మంది ఇది కావాల‌ని చేసిన విన్యాస‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Latest News