నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో CM KCR పర్యటన.. దెబ్బతిన్న పంటల పరిశీల‌న‌

రెడ్డి కుంట తండా అడవి రంగాపురంలో పర్యటన సంగెం మండలంలో పర్యటన ఉన్నట్టా లేనట్టా విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23వతేదీ గురువారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు ఖమ్మం నుండి హెలి క్యాప్టర్ ద్వారా మహబూబాబాద్ జిల్లా, పెద్ద వంగర మండలం, రెడ్డికుంట తండాకు చేరుకొని అకాల […]

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో CM KCR పర్యటన.. దెబ్బతిన్న పంటల పరిశీల‌న‌
  • రెడ్డి కుంట తండా అడవి రంగాపురంలో పర్యటన
  • సంగెం మండలంలో పర్యటన ఉన్నట్టా లేనట్టా

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23వతేదీ గురువారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.

గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు ఖమ్మం నుండి హెలి క్యాప్టర్ ద్వారా మహబూబాబాద్ జిల్లా, పెద్ద వంగర మండలం, రెడ్డికుంట తండాకు చేరుకొని అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించనున్నారు. అక్కడ బాధితులతో మాట్లాడుతారు. రెడ్డికుంట తండా నుండి హెలీ కాప్టర్ ద్వారా వరంగల్ జిల్లా, దుగ్గొండి మండలం, అడవి రంగాపురానికి చేరుకుని అకాలవర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. బాధితులను ఓదారుస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీస్, వ్యవసాయ అధికారులు, సంబంధిత ఇతరశాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, zp చైర్మన్లు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతారని మంత్రి తెలిపారు.

హెలీపాడ్ పరిశీలించిన ఎమ్మెల్యేలు

గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ను మంగ‌ళ‌వారం మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు. బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అడవి రంగాపురంలో ఏర్పాటుచేసిన హెఈపాడ్‌ను పరిశీలించి పోలీసు అధికారులకు తగిన సూచనలు చేశారు.

అయితే అడవి రంగాపురంతో పాటు పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలం పల్లార్గూడ, వంజరపెల్లి గ్రామాలలో పంట నష్టాన్ని పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం టెక్స్టైల్ పార్కు చేరుకొని అక్కడ నుంచి హెలీకాప్టర్లో హైదరాబాద్ తిరుగు పయనం అవుతారని భావించారు. మంత్రి ఎర్రబెల్లి ప్రకటించిన సీఎం పర్యటనలో సంగెం మండలం పర్యటన లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.