ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డిపై దాడులు
మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జే చంద్రశేఖర్ దాడికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం విధాత, ఉమడి మహబూబ్నగర్ ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేశారని మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జే చంద్రశేఖర్ అన్నారు. రేవంత్ రెడ్డి పై దాడులకు నిరసనగా మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో […]

- మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జే చంద్రశేఖర్
- దాడికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
విధాత, ఉమడి మహబూబ్నగర్ ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేశారని మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జే చంద్రశేఖర్ అన్నారు. రేవంత్ రెడ్డి పై దాడులకు నిరసనగా మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడోయాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తున్నదని, పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఇది చూసి తట్టుకోలేని అధికార పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి పై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. వీటికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి భయపడరని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు.