Das Ka Dhamki: అప్పుడే ఓటీటీలో ధమ్కీ ఇచ్చేందుకు వచ్చేస్తోన్న విశ్వక్ సేన్

విధాత‌, సినిమా:  మల్టీ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రం మార్చి 22న పాన్ ఇండియా వైజ్‌గా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. మిక్స్‌డ్ టాక్‌తో సరిపెట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మాత్రం పరవాలేదని అనిపించుకుంది. మొత్తంగా మేకర్స్‌కి సేఫ్ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో ‘ధమ్కీ’ ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. […]

Das Ka Dhamki: అప్పుడే ఓటీటీలో ధమ్కీ ఇచ్చేందుకు వచ్చేస్తోన్న విశ్వక్ సేన్

విధాత‌, సినిమా: మల్టీ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రం మార్చి 22న పాన్ ఇండియా వైజ్‌గా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. మిక్స్‌డ్ టాక్‌తో సరిపెట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మాత్రం పరవాలేదని అనిపించుకుంది. మొత్తంగా మేకర్స్‌కి సేఫ్ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో ‘ధమ్కీ’ ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 14 నుంచి ‘దాస్ కా ధమ్కీ’ ఓటీటీలో సందడి చేయనుంది. ఏ ప్లాట్‌ఫామ్‌లో.. అని అనుకుంటున్నారా? తెలుగువారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఆహా’లో.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్‌పై విశ్వ‌క్ సేన్‌, కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌, హైప‌ర్ ఆది, రంగ‌స్థ‌లం మ‌హేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అయితే ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ రాబట్టుకోవడానికి కారణం..

ఇదే ప్యాట్రన్‌లో అంతకు ముందు ‘ధమాకా’ చిత్రం రావడం. ‘ధమాకా’ చిత్రం కూడా డబుల్ యాక్షన్‌గా ఉండటం.. ఆ చిత్రానికి, ఈ చిత్రానికి ఒకరే ప్రసన్నకుమార్ కథని అందించడంతో పాటు.. సెకండాఫ్ గందరగోళంగా ఉండటంతో.. ప్రేక్షకులు ఈ సినిమాపై అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. అందుకే బ్లాక్‌బస్టర్ అనుకున్న ఈ చిత్రం యబౌ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.