చెల్లిని పెళ్లి చేసుకున్న అన్న‌.. కార‌ణ‌మేమిటంటే..?

విధాత‌: మానవ బంధాల‌లో అన్నాచెల్లెలి బంధం ప‌విత్ర‌మైన‌ది. అపురూప‌మైన‌ది. అలాంటి బంధానికి మాయ‌ని మ‌చ్చ తెచ్చారు ఓ అన్నా చెల్లి. వావివ‌ర‌స‌లు గాలికి వ‌దిలేసి ఓ అన్న సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. అలా ఎందుకు చేశారో కారణం తెలిస్తే మనమూ నోరెళ్ల బెట్టాల్సిందే.. ఆ వివ‌రాళ్లోకెళితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్‌లో నివాసం ఉంటున్న దంప‌తుల‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్ద‌రూ పెళ్లి వ‌య‌స్సు ఉన్న‌ వారే. ముందు కూతురు పెళ్లి చేసి ఆ త‌రువాత కొడుకు […]

చెల్లిని పెళ్లి చేసుకున్న అన్న‌.. కార‌ణ‌మేమిటంటే..?

విధాత‌: మానవ బంధాల‌లో అన్నాచెల్లెలి బంధం ప‌విత్ర‌మైన‌ది. అపురూప‌మైన‌ది. అలాంటి బంధానికి మాయ‌ని మ‌చ్చ తెచ్చారు ఓ అన్నా చెల్లి. వావివ‌ర‌స‌లు గాలికి వ‌దిలేసి ఓ అన్న సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. అలా ఎందుకు చేశారో కారణం తెలిస్తే మనమూ నోరెళ్ల బెట్టాల్సిందే.. ఆ వివ‌రాళ్లోకెళితే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్‌లో నివాసం ఉంటున్న దంప‌తుల‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్ద‌రూ పెళ్లి వ‌య‌స్సు ఉన్న‌ వారే. ముందు కూతురు పెళ్లి చేసి ఆ త‌రువాత కొడుకు పెళ్లి చేయాల‌ని అంద‌రి త‌ల్లిదండ్ర‌లలాగే ఆ త‌ల్లిదండ్రులు అనుకున్నారు.

అయితే అదే సమయంలో టుండ్లా బ్లాక్ ఏరియాలో సామూహిక వివాహాలు చేయాల‌ని యూపీ ప్ర‌భుత్వం భావించింది. ఇందులో భాగంగా 51 జంట‌ల‌ను ఎంపిక చేసింది. వారికి ప్ర‌భుత్వ‌మే దుస్తుల‌తో స‌హా పెళ్లి ఖ‌ర్చులు, గృహోప‌క‌ర‌ణాలు అంద‌జేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వం అందించే వ‌స్తువులు, సాయం కోసం చేయ‌రాని ప‌ని చేశారు ఈ అన్నాచెల్లెలు.. సొంత చెల్లికి మూడు ముళ్లు వేశాడా అన్న.

విష‌యం కాస్త బ‌య‌ట‌కు పొక్కి అధికారుల‌కు తెలిసింది. పెళ్లి ఖ‌ర్చులు, గృహోక‌ర‌ణాల కోసం చెల్లిని పెళ్లి చేసుకున్న అన్న‌పై కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చినా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.