ట్విట్టర్ CEO పదవి నుంచి పరాగ్ అగర్వాల్ తొలగింపు

విధాత: ట్విట్టర్‌ యాజమాన్య బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గురువారం చేపట్టారు. ఉద్యోగులను తొలగించనని హామీ ఇచ్చిన ఆయన పెద్ద చేపలపై వేటు వేశాడు. ట్విట్టర్‌ను తాను కొనేటపుడు తనను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించిన వారిపై మస్క్ ప్రతాపం చూపుతున్నాడు. Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7 — Elon Musk (@elonmusk) October 26, 2022 ట్విట్టర్ సీఈవో, భారత సంతతి సాఫ్ట్ వేర్ నిపుణుడైన పరాగ్ […]

ట్విట్టర్ CEO పదవి నుంచి పరాగ్ అగర్వాల్ తొలగింపు

విధాత: ట్విట్టర్‌ యాజమాన్య బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గురువారం చేపట్టారు. ఉద్యోగులను తొలగించనని హామీ ఇచ్చిన ఆయన పెద్ద చేపలపై వేటు వేశాడు. ట్విట్టర్‌ను తాను కొనేటపుడు తనను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించిన వారిపై మస్క్ ప్రతాపం చూపుతున్నాడు.

ట్విట్టర్ సీఈవో, భారత సంతతి సాఫ్ట్ వేర్ నిపుణుడైన పరాగ్ అగర్వాల్, భారత సంతతికే ట్విట్టర్ లీగల్, పాలసీ అండ్ ట్రస్ట్ విభాగం అధిపతి విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, జనరల్ కౌన్సెల్ సియాన్ ఎడ్జెట్‌లను తదితరులకు ఉద్వాసన పలికారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయం నుంచి పరాగ్ అగర్వాల్, సెగల్, ఎడ్జెట్‌‌ల వెంట ఇద్దరు వ్యక్తులు వెళ్ళి బయటకు పంపినట్లు తెలుస్తోంది. అంతేగాక ఇకపై ట్విట్టర్‌ ఉచితంగా ఉండదని బాంబ్‌ పేల్చారు.