కలిసిన జాతకాలు.. భారతీయ సంప్రదాయ ప్రకారం.. మైనాను పెళ్లాడిన చిలుక
Parrot Myna Marriage | ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఇష్టపడినప్పుడే పెళ్లి వేడుక ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జాతకాలు కలుస్తున్నాయా? లేదా? అని చూస్తాం. ఒక వేళ జాతకాలు కలవకపోతే ఆ పెళ్లిని రద్దు చేసుకుంటాం. జాతకాలు కలిస్తే.. వివాహ పనులు మొదలు పెడుతాం. ఇక ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. ఆ మాదిరిగా రెండు పక్షులు ఇష్టపడటం.. జాతకాలు కలియడం జరిగిపోయాయి. ఇక భారతీయ సంప్రదాయం ప్రకారం.. ఆ రెండు పక్షులకు అంగరంగ వైభవంగా […]

Parrot Myna Marriage | ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఇష్టపడినప్పుడే పెళ్లి వేడుక ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జాతకాలు కలుస్తున్నాయా? లేదా? అని చూస్తాం. ఒక వేళ జాతకాలు కలవకపోతే ఆ పెళ్లిని రద్దు చేసుకుంటాం. జాతకాలు కలిస్తే.. వివాహ పనులు మొదలు పెడుతాం. ఇక ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. ఆ మాదిరిగా రెండు పక్షులు ఇష్టపడటం.. జాతకాలు కలియడం జరిగిపోయాయి. ఇక భారతీయ సంప్రదాయం ప్రకారం.. ఆ రెండు పక్షులకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఇదేదో వినడానికి, చదవడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయితే తప్పకుండా మధ్యప్రదేశ్ వెళ్లాల్సిందే.
మధ్యప్రదేశ్‌లోని పైపారియా గ్రామానికి చెందిన రామ్‌స్వరూప్ పరిహార్ మైనా అనే పక్షిని సొంత కూతురిలాగా పెంచుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన బాదల్ లాల్ విశ్వకర్మ కూడా చిలుకను పెంచుకుంటున్నాడు. అయితే ఈ రెండు పక్షులకు వివాహం చేయాలని పరిహార్, విశ్వకర్మ నిర్ణయించారు. దీంతో ఆదివారం గ్రామస్తుల సమక్షంలో భారతీయ సంప్రదాయం ప్రకారం ఆ రెండు పక్షులకు వివాహం జరిపించారు. చిలుకా, మైనా దంపతులకు బరాత్ కూడా నిర్వహించారు. చిలుక, మైనాను ఓ చిన్న వాహనంలో ఓ పంజరంలో ఉంచి ఊరేగింపు చేశారు. ఈ ఊరేగింపులో గ్రామస్తులు జోష్‌తో నృత్యాలు చేశారు. ప్రస్తుతం ఈ పక్షుల వివాహంపై స్థానికులు చర్చించుకుంటున్నారు.