పార్టీయే నా బలం.. కార్యకర్తలే నా ‘బలగం’: మంత్రి ఎర్రబెల్లి
మీ అండదండలతో గెలిచా కెసిఆర్ ఆశీస్సులతో మంత్రినయ్యా విడతల వారీగా సొంత స్థలాల్లో ఇండ్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పార్టీయే బలం, పార్టీ కార్యకర్తలే నా బలగం. పార్టీని కన్న తల్లిలా చూసుకోవాలి.కొద్దిపాటి తేడాలుంటే సర్దుకుపోవాలి. సమస్యలుంటే పక్కన పెడదాం. అంతా కలిసి కట్టుగా ఉండాలి. ఆత్మీయంగా ఉందామని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వడ్డే కొత్త పల్లి, […]

- మీ అండదండలతో గెలిచా
- కెసిఆర్ ఆశీస్సులతో మంత్రినయ్యా
- విడతల వారీగా సొంత స్థలాల్లో ఇండ్లు
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పార్టీయే బలం, పార్టీ కార్యకర్తలే నా బలగం. పార్టీని కన్న తల్లిలా చూసుకోవాలి.కొద్దిపాటి తేడాలుంటే సర్దుకుపోవాలి. సమస్యలుంటే పక్కన పెడదాం. అంతా కలిసి కట్టుగా ఉండాలి. ఆత్మీయంగా ఉందామని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వడ్డే కొత్త పల్లి, పెద్ద వంగరలో ఆదివారం జరిగిన బిఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ఎర్రబెల్లి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..
మీ అందరి దయ వల్ల నేను పాలకుర్తి నుండి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. సిఎం నన్ను మంత్రిని చేశారు. మంచి పోర్టు పోలియో ఇచ్చారని దీన్ని సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గాన్ని ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశానన్నారు. బిజెపి వాళ్ళు పిచ్చిపిచ్చిగా మాట్లాడతారు. ఊరు కొక్కరు ఉండరు కానీ ఊరికే మాట్లాడుతారు. తిప్పి కొట్టాలని మంత్రి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అభివృద్ధి ఓర్వలేక బిజెపి విమర్శలు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బిజెపి మన రాష్ట్రంపై, మన సీఎం పై కక్ష కట్టిందని ఆత్మీయ అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. అందరికీ పార్టీ కార్యకర్తలే బలం, ప్రజలే బలగమని చమత్కరించారు. ప్రభుత్వానికి కృతజ్ఞతగా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు మాట్లాడారు. అనంతరం మహిళలతో కలిసి భోజనాలు చేశారు. సరదాగా గడిపారు. సమావేశంలో గ్రామపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.