YADADRI: రేపటి నుంచి పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు

విధాత: యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయం పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 31నుండి వచ్చే నెల ఫిబ్రవరి 6 వ తేదీ వరకు ఏడు రోజుల పాటు కొనసాగనున్నాయి. రోజు వారి బ్ర‌హ్మోత్స‌వ పూజా వివ‌రాలు 31వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనం, రక్షాబంధనం, పుణ్యాహవాచనంతో బ్రహ్మోత్సవాల ఘట్టం మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం నిర్వహిస్తారు. ఫిబ్రవరి ఒకటో తేదీ బుధవారం ఉదయం 10 […]

  • Publish Date - January 30, 2023 / 02:17 PM IST

విధాత: యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయం పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 31నుండి వచ్చే నెల ఫిబ్రవరి 6 వ తేదీ వరకు ఏడు రోజుల పాటు కొనసాగనున్నాయి.

రోజు వారి బ్ర‌హ్మోత్స‌వ పూజా వివ‌రాలు

  • 31వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనం, రక్షాబంధనం, పుణ్యాహవాచనంతో బ్రహ్మోత్సవాల ఘట్టం మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం నిర్వహిస్తారు.
  • ఫిబ్రవరి ఒకటో తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, వేద పారాయణాలు, సాయంత్రం 6 గంటలకు భేరిపూజ , దేవతాహ్వానం చేయ‌నున్నారు.
  • రెండో తేదీన గురువారం ఉదయం 6 గంటలకు హవనం, సింహ వాహనం అలంకార సేవ, ఆరు గంటలకు హవనం, ఎనిమిది గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అశ్వవాహన సేవ నిర్వ‌హిస్తారు.
  • మూడవ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు హవనం, తిరుమంజస ఉత్సవం, హనుమంత వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు హవనం, రాత్రి 7 గంటలకు శ్రీవారి తిరుకళ్యాణోత్సవం, గజవాహన సేవ చేయ‌నున్నారు.
  • నాలుగో తేదీ శనివారం 8 గంటలకు హవనం, గరుడ వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు రథంగా హోమం, రాత్రి 8 గంటలకు శ్రీవారి దివ్య విమాన రథోత్సవం జ‌ర‌ప‌నున్నారు.
  • ఐదవ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు దేవతో ద్వాసన, శ్రీ పుష్పయాగం, డోలారోహణం వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.
  • ఆరవ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, మధ్యాహ్నం 1గంటలకు మహాదాశీర్వచనం, పండిత సన్మానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

కాగా పాతగుట్ట అధ్యయనోత్సవాలు సోమవారం నూత్తందారి చాత్మరా ఘట్టంతో ముగిశాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సోమవారం ఒకరోజు ఆదాయం 23లక్షల 4వేల 311రూపాయలుగా వచ్చినట్లు ఆల‌య ఈవో గీత తెలిపారు.

Latest News