సాగర్ సందర్శించిన పాట్నా, ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తులు

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను మంగళవారం పాట్నా, ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తులు అంజనీ కుమార్ శరన్, గౌరీ శంకర్ సత్పతి కుటుంబ సమేతంగా సందర్శించారు.

విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న న్యాయమూర్తులకు నిడమనూరు కోర్టు నాజర్ అంజయ్య, ప్రొటోకాల్ డిప్యూటీ తహసీల్దార్ శరత్ చంద్ర ఘన స్వాగతం పలికారు. పోలీసు వందనం స్వీకరించారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్, బుద్ధవనం సందర్శించారు.
బుద్ధ చరిత వనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. జాతకవనం, ధ్యానమనం, మహా స్తూపం సందర్శించి కొద్దిసేపు ధ్యానం చేశారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ… నాగార్జునసాగర్ డ్యాం విశేషాలు, బుద్ధవనం చారిత్రక వివరాలు తెలియజేశారు. వీరితో పాటు స్థానిక ఎస్సై సంపత్ గౌడ్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ దండ శ్రీనివాస్ రెడ్డి, కోర్టు సిబ్బంది కాలిక్ ఉన్నారు.