పట్టాభికి ఇక్కట్లు.. నారాయణకు టిక్కెట్! పాపం పట్టాభి
ఒళ్ళు వాచినా పదవి దక్కలేదు! విధాత: నోరా వీపుకు చేటు తేవద్దే అని ఊరకనే అనలేదు. జగన్ మీద.. ప్రభుత్వం మీద నోటికొచ్చినట్లు మాట్లాడడం ద్వారా పాపులర్ అయిన పట్టాభికి పాపం చివరికి ఇక్కట్లే మిగిలాయి తప్ప టిక్కెట్ దక్కేలా లేదు.. ప్రభుత్వాన్ని, జగన్ను ఇష్టానుసారం తిట్టడం ద్వారా చంద్రబాబు దృష్టిలో తాను గొప్పవాడిగా.. పోరాట వీరుడిగా.. భయం లేని వాడిగా ఫోకస్ అవుతానని భవించారో ఏమోగానీ మొత్తానికి ప్రెస్‌మీట్లు.. టివి డిబేట్లలో పట్టాభి విరుచుకుపడిపోతారు. కొంతవరకూ […]

- ఒళ్ళు వాచినా పదవి దక్కలేదు!
విధాత: నోరా వీపుకు చేటు తేవద్దే అని ఊరకనే అనలేదు. జగన్ మీద.. ప్రభుత్వం మీద నోటికొచ్చినట్లు మాట్లాడడం ద్వారా పాపులర్ అయిన పట్టాభికి పాపం చివరికి ఇక్కట్లే మిగిలాయి తప్ప టిక్కెట్ దక్కేలా లేదు.. ప్రభుత్వాన్ని, జగన్ను ఇష్టానుసారం తిట్టడం ద్వారా చంద్రబాబు దృష్టిలో తాను గొప్పవాడిగా.. పోరాట వీరుడిగా.. భయం లేని వాడిగా ఫోకస్ అవుతానని భవించారో ఏమోగానీ మొత్తానికి ప్రెస్‌మీట్లు.. టివి డిబేట్లలో పట్టాభి విరుచుకుపడిపోతారు. కొంతవరకూ దీన్ని సహించిన ప్రభుత్వం మొత్తానికి ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపింది.
ఇదిలా ఉండగా పట్టాభి ఇలా నోరేసుకుని పడిపోవడం పార్టీకి పెద్ద లాభం లేదని టిడిపి పెద్దలు భావించి ఆయన్ను లైట్ తీసుకున్నారని తెలుస్తోంది. పట్టాభి మొన్న టీవీలో మాట్లాడుతూ గన్నవరంలో వల్లభనేని వంశీని సునాయాసంగా ఓడిస్తానని ప్రతిన బూనారు. వంశీని ఓడించడానికి.. ఢీకొనడానికి లోకేష్.. చంద్రబాబు అక్కర్లేదని.. తాను ఒక్కడినే చాలని తొడగొట్టారు. మొత్తానికి అది అలా ఉండగానే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయడం.. చేతులు వాచేలా కొట్టడం జరిగిపోయింది.
తనకు పార్టీలో విపరీతంగా మైలేజీ పెరిగిందని, గన్నవరం టికెట్ తనదే అని ఆయన నమ్మకం పెట్టుకున్నారు. ఇక తనను గన్నవరం ఇన్‌చార్జిగా నియమించడమే తరువాయి అనుకున్నారు. కానీ,
ప్రస్తుతం పట్టాభి జైల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను చంద్రబాబు నియమించారు. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురై ప్రస్తుతం ఆస్పత్రిలో ఉండగా ఇప్పుడు నారాయణను చంద్రబాబు ఈ గన్నవరానికి ఇన్‌చార్జిగా నియమించారు. ఈ నారాయణ 1999-2004 మధ్య మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు.
నోటి దురుసుతో రోజూ తగాదాలు తెచ్చి కోర్టులు.. కేసులతో సయ్యటలాడే పట్టాభిని నెత్తికి ఎత్తుకోవడం ఎందుకు అని భావించిన పార్టీ అధిష్టానం పట్టాభిని పక్కన బెట్టేసినట్లు తెలుస్తోంది. పాపం.. ఇక్కట్లు కాస్తా పట్టాభికి దక్కగా టిక్కెట్ మాత్రం నారాయణ చేతికి వచ్చింది..