Pawan Kalyan | పవన్ కళ్యాణ్ అరెస్ట్.. రోడ్డు పైనే పడుకున్న జనసేనాని
Pawan Kalyan | చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది.చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పలువురు టీడీపీ నాయకులతో పాటు కార్యకర్తలని కూడా అరెస్ట్ చేస్తున్నారు.అయితే జనసేనాని పవన్ కళ్యాణ్‌ని కూడా వారు పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం వేడెక్కింది. అనుమంచి పల్లిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పవన్ కళ్యాణ్‌ని అరెస్టు చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు జరిగే పీఏసీ మీటింగ్‌లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ వెళుతుండగా,ఆయనని అరెస్ట్ చేశారు. చంద్రబాబు […]

Pawan Kalyan |
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది.చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పలువురు టీడీపీ నాయకులతో పాటు కార్యకర్తలని కూడా అరెస్ట్ చేస్తున్నారు.అయితే జనసేనాని పవన్ కళ్యాణ్‌ని కూడా వారు పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం వేడెక్కింది. అనుమంచి పల్లిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పవన్ కళ్యాణ్‌ని అరెస్టు చేశారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు జరిగే పీఏసీ మీటింగ్‌లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ వెళుతుండగా,ఆయనని అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు వస్తాయని ఎంత విజ్ఞప్తి చేసినా వినక పోవడంతో అరెస్ట్ చేయక తప్పలేదని పోలీసులు అంటున్నారు.
అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కూడా ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. చివరికి పోలీసులు స్వయంగా తమ వాహనంలో వారద్దరిని తీసుకొచ్చి మంగళగిరిలో విడిచిపెట్టారు.
ఆ సమయంలో పవన్‌కి ఘన స్వాగతం లభించింది. వారందరికి అభివాదం చేసి అనంతరం ఆయన లోపలికి వెళ్లారు. అయితే అంతకముందు పోలీసులు తనని అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని జనసేనాని నిరసన తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ -విజయవాడ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోయి భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
విజయవాడకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ కు పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెకోపోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా, వాటిని జనసైనికులు తొలగించడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి మరింత వేడెక్కింది.
అయితే జనసేనాని పవన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తారని మేమేమీ ముందుగా ఊహించలేదు. వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం మేము రేపు ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నాం. అందులో భాగంగానే ఏపీకి బయల్దేరాను. కానీ తనను మార్గం మధ్యలోనే పోలీసులు ఆపేశారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బయట ఉన్నాడు. ఎంతసేపూ ఆ ముఖ్యమంత్రి జైలు గురించే ఆలోచిస్తాడు. అందర్నీ జైలుకి ఎలా పంపాలా అనే ఆలోచిస్తాడు. అతనో క్రిమినల్. విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాలి. అలాంటి వాడి చేతిలో అధికారం ఉంది అది దురదృష్టమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్స్ అవ్వాలని కోరుకుంటాడు. దీనికంతటికీ అదే అసలు కారణమని పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.